Apartment: అపార్ట్మెంట్ ఫ్లాట్లు పాతబడటం వల్ల వాటి విలువ తగ్గిపోతుందనేది అపోహ మాత్రమేనని రియల్ ఎస్టేట్ నిపుణులు స్పష్టం చేశారు. రీ-డెవలప్‌మెంట్ ద్వారా పాత ఫ్లాట్లు కొత్తవిగా మారుతాయని, దశాబ్దాల క్రితం పెట్టిన..
అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కొంటే 20 ఏళ్ల తర్వాత దాని విలువ తగ్గిపోతుందనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. కాలక్రమేణా భవనం పాతబడవచ్చు కానీ, ఆ భవనం ఉన్న భూమి విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. దశాబ్దాల క్రితం లక్షల్లో కొన్న ఫ్లాట్లు నేడు కోట్లకు చేరుకున్నాయి. కాబట్టి డిప్రిసియేషన్ గురించి ఆందోళన చెందకుండా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టవచ్చునని బిజినెస్ నిపుణులు అంటున్నారు.
25
రీ-డెవలప్‌మెంట్ ప్రయోజనం:
ఒకవేళ అపార్ట్మెంట్ బిల్డింగ్ కూలిపోయే స్థితికి వచ్చినా, అందులో ఉండే ఫ్లాట్ యజమానులకు రీ-డెవలప్‌మెంట్ రూపంలో కొత్త అపార్ట్మెంట్ లభిస్తుంది. బిల్డర్‌కు కొంత మొత్తం చెల్లించి మళ్ళీ కొత్త ఫ్లాట్ పొందవచ్చు, దీని వల్ల పాత ఆస్తి కాస్తా సరికొత్తగా మారుతుంది. ఇది మీ మొదటి పెట్టుబడికి భారీ అప్రిసియేషన్‌ను జోడిస్తుంది. భూమిలో ఉండే వాటా(UDS) ఎప్పుడూ సురక్షితంగా ఉంటుంది.
35
ఫ్లాట్ వర్సెస్ ఇండిపెండెంట్ హౌస్:
ఇండిపెండెంట్ హౌస్ విలువ ఆరేళ్లకు రెట్టింపు అయితే, అపార్ట్మెంట్ ఫ్లాట్ విలువ 10 ఏళ్లకు రెట్టింపు అవుతుంది. అయితే అపార్ట్మెంట్లో మీకు మొదటి నెల నుంచే అద్దె రూపంలో ఆదాయం ప్రారంభమవుతుంది. ఈ అద్దె ఆదాయాన్ని కూడా కలిపి చూస్తే రెండింటి ప్రయోజనాలు దాదాపు ఒకేలా ఉంటాయి. మన బడ్జెట్, అవసరాలను బట్టి ఏది కొన్నా లాభమే తప్ప నష్టం ఉండదు.
2001లో హైదరాబాద్‌లో 6 లక్షలకు లభించే ఫ్లాట్ నేడు కనీసం 50 లక్షల కంటే తక్కువకు దొరకదు. గత 23 ఏళ్లలో ఈ ఫ్లాట్ విలువ తగ్గకపోగా అనేక రెట్లు పెరిగింది. రియల్ ఎస్టేట్ చరిత్రలో ఎక్కడైనా ఆస్తి విలువ తగ్గిన సందర్భాలు లేవని నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. కాబట్టి కాలం గడిచే కొద్దీ ఆస్తి విలువ పెరుగుతుందే తప్ప తరగదు.
55
పెట్టుబడి, ఎంజాయ్‌మెంట్:
ఇల్లు అనేది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, మన సంతోషం కూడా. డిప్రిసియేషన్ అనే భయంతో ఫ్లాట్ కొని అందులో ఉండటం ఆపవద్దు. ఏ రోజు అమ్మినా మీ పెట్టుబడి కంటే ఎక్కువే వస్తుంది. కాబట్టి హ్యాపీగా అపార్ట్మెంట్ లైఫ్‌ను ఎంజాయ్ చేయండి. అద్దె ఆదాయం, ఆస్తి విలువ పెరుగుదల రెండూ కలిపి మీ ఫైనాన్షియల్ భవిష్యత్తును భద్రంగా ఉంచుతాయి.