Business Idea: రోడ్డు సైడ్ అని చీప్‌గా చూడకండి.. ఈ వ్యాపారం మొదలుపెడితే ప్రతీ నెలా రూ. 1 లక్ష పక్కా.!

Published : Mar 16, 2026, 10:00 AM IST

Business Idea: కేవలం రూ. 1.50 లక్షల రూపాయల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. రోజుకు సుమారు 100 ప్లేట్లు(ఒక్కో ప్లేట్ ధర రూ. 120 అనుకుంటే) విక్రయించడం ద్వారా రోజుకు రూ. 12,000 వరకు ఆదాయం లభిస్తుంది.  

PREV
15
లో రిస్క్ వ్యాపారం..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో బయట ఫుడ్ తినే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే ఫుడ్ బిజినెస్ అనేది ఎప్పుడూ డిమాండ్ ఉండే వ్యాపారం. ముఖ్యంగా రోడ్ సైడ్ ఫుడ్ పాయింట్స్ ద్వారా తక్కువ పెట్టుబడితో అద్భుతమైన ఆదాయాన్ని ఎలా పొందాలో చూసేద్దాం..

25
పెట్టుబడి, నిర్వహణ

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సుమారు రూ. 1.50 లక్షల రూపాయల ప్రారంభ పెట్టుబడి అవసరమవుతుంది. ఇది బండి తయారీ, పాత్రలు, ఇతర పరికరాల కోసం సరిపోతుంది. మీరు అందించే భోజనం లేదా ప్లేట్ ధర రూ. 120 గా నిర్ణయించుకుంటే, రోజుకు సగటున 100 మంది కస్టమర్లు వచ్చినా రూ. 12,000 మీకు చేరుతుంది.

35
నికర లాభం

రోజుకు రూ. 12,000 చొప్పున నెలకు రూ. 3,60,000 వస్తుంది. సరుకులు, పనివారు, గ్యాస్, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం నెలకు సుమారు రూ. 2,50,000 ఖర్చవుతుంది. అన్ని ఖర్చులు పోను నెలకు సుమారు రూ. 1,10,000 నికర లాభం మిగులుతుంది.

45
నాణ్యత, రుచి ప్రధానం

రోడ్ సైడ్ బిజినెస్ అనగానే కేవలం తక్కువ ధర మాత్రమే కాదు, నాణ్యత, రుచి కూడా ప్రధానం. ప్రజలు శుభ్రతను కూడా ఎక్కువగా గమనిస్తారు. మీరు అందించే ఆహారం ఇంట్లో తిన్న అనుభూతిని కలిగిస్తే, కస్టమర్లు పదే పదే మీ వద్దకే వస్తారు.

55
సరైన ప్లాన్ ముఖ్యం

ఏ వ్యాపారమైనా ప్రారంభంలో కష్టంగానే ఉంటుంది. కానీ సరైన ప్రణాళిక, పట్టుదల ఉంటే ఫుడ్ బిజినెస్‌లో లక్షాధికారి కావడం పెద్ద కష్టమేమీ కాదు. ఏడాదికి రూ. 13 లక్షలకు పైగా సంపాదించే అవకాశం ఉన్న ఈ వ్యాపారంలోకి ప్రవేశించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.

Read more Photos on
click me!

Recommended Stories