పెట్టుబడితో పాటు మేకలను పెంచుకుంటూ పోతే నెలవారి ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే మేకల పాల ఉత్పత్తి పెరిగేందుకు మంచి గడ్డిని మేతగా అందించాలి. అలాగే రోజూ తగినంత నీరు అందించారు. మేకల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన టీకాలను అందించాలి.
మేక పాలకు ఎందుకంత డిమాండ్.?
మేకపాలలో అధిక పోషకాలు ఉంటాయి. మేకపాలలో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. లాక్టోజ్ ఇంటోలరెన్స్ ఉన్నవారికి మేకపాలు మంచి ప్రత్యామ్నాయం. పిల్లల పెరుగుదలకు, హార్మోన్ల సమతుల్యతకు సహాయపడతాయి.క్యాన్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు, పేగు సమస్యల నివారణకు ఉపయోగపడతాయి. ఈ పాలలో క్యాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మేక పాలు ఉపయోగపడతాయి.