Maruti Suzuki WagonR: వేగన్ ఆర్ కారు కొనాలంటే ఇప్పుడే కొనండి, మంచి డిస్కౌంట్ ఆఫర్ ఇదిగో

Published : Feb 12, 2025, 01:37 PM IST

బెస్ట్ ఫ్యామిలీ కారుగా గుర్తింపు పొందిన మారుతి సుజుకి వేగన్ ఆర్ కారుపై ఆ కంపెనీ మంచి డిస్కౌంట్ ను ప్రకటించింది. మీరు గాని ఈ కారు కొనే ఆలోచనలో ఉంటే ఇదే మంచి టైం. మారుతి సుజుకి ప్రకటించిన డిస్కౌంట్, కొత్త వేగన్ ఆర్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం రండి.   

PREV
15
Maruti Suzuki WagonR: వేగన్ ఆర్ కారు కొనాలంటే ఇప్పుడే కొనండి, మంచి డిస్కౌంట్ ఆఫర్ ఇదిగో

మారుతి సుజుకి వేగన్ఆర్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా వినియోగదారులకు ఇష్టమైన కారుగా నిలిచింది. ఫ్యామిలీ కారుగా ఫేమస్ అయిన ఈ కారు బడ్జెట్ కూడా ఫ్యామిలీ మెన్ బడ్జెట్ లోనే ఉంటుంది. ఇటీవల వేగన్ ఆర్ కొత్త ఫీచర్స్ తో న్యూ మోడల్ మార్కెట్ లోకి విడుదలైంది. ఈ కొత్త కారు భారీగా సేల్ అవుతోంది. దాని అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి.

25

రూ.48,100 వరకు తగ్గింపు 

మారుతి సుజుకి వేగన్ ఆర్ అమ్మకాలను ఈ నెలలో మరింత పెంచడానికి కంపెనీ రూ.48,100 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ 2024, 2025 మోడల్ కార్లకు వర్తిస్తుంది. అయితే కస్టమర్‌లు ఫిబ్రవరి 28లోపు మాత్రమే ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోగలరు. కాబట్టి మీరు ఈ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే వెంటనే మీ సమీపంలోని మారుతి సుజుకి డీలర్ ను సంప్రదించి డిస్కౌంట్ ఆఫర్ గురించి మాట్లాడండి. వెంటనే కారు బుక్ చేసుకోండి. 

35

కొత్త వేగన్ ఆర్ ఫీచర్లు

కొత్త వేగన్ఆర్ నెక్స్ట్ జనరేషన్ K-సిరీస్ 1.5 లీటర్ డ్యూయల్ జెట్ WT ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇందులో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో కలిసి 103 హార్స్‌పవర్, 137 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మాన్యువల్ వేరియంట్ 20.15 kmpl మైలేజీని అందిస్తుంది. అదేవిధంగా ఆటోమేటిక్ వేరియంట్ 19.80 kmpl మైలేజీని అందిస్తుంది. ఇంధన సామర్థ్యం పెంచామని మారుతి సుజుకి ప్రకటించింది. 

45

బెస్ట్ ఫ్యామిలీ కారు

360 డిగ్రీ కెమెరాతో కూడిన ఈ కారు అధునాతన సాంకేతికతను కలిగి ఉంది. ఈ కెమెరా కారులోని 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అనుసంధామై ఉంది. దీన్ని సుజుకి, టయోటా కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది.

వినియోగదారులు లోపల కూర్చున్నప్పుడు వాహనం చుట్టూ ఉన్న ప్రాంతాలను స్క్రీన్‌పై చూడొచ్చు. ఇదే ఈ కారులో స్పెషాలిటీ. 

55

బడ్జెట్ కారు

ఈ కారులో కేబుల్స్ లేకుండానే వేగంగా స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫోన్ వేడెక్కకుండా కంట్రోల్ చేసే భద్రతా చర్యలు కూడా ఇందులో ఉన్నాయి. అదనంగా మారుతి నుండి వివిధ కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ వేగన్ ఆర్ ను చిన్న SUV లగ్జరీ కారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కారు ధర రూ. 5.54 లక్షల నుంచి రూ. 7.33 లక్షలు (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. సిటీ, డీలర్, మోడల్ వేరియంట్‌ను బట్టి ధరల్లో కొద్దిగా మార్పు ఉండొచ్చు. 

ఇది కూడా చదవండి మారుతి ఇన్విక్టోకి పోటీగా ఉన్న 5, 7 సీటర్ సూపర్ కార్లు ఇవే..

click me!

Recommended Stories