వ్యాపారులు కేవలం 9తోనే ధరలను ముగించరు. కొన్ని ఉత్పత్తులకు 5, 7 వంటి అంకెలతో కూడా ధరలను నిర్ణయిస్తారు. ఇలా చేయడం ద్వారా ఉత్పత్తి ధరను ఒక నిర్దిష్ట స్థాయిలో ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తారు. మరోవైపు, కొన్ని లగ్జరీ ఉత్పత్తులకు పూర్తి సంఖ్యలు లేదా ఇతర రకాల ధరలను ఉపయోగిస్తారు. దీని ద్వారా ప్రొడక్ట్ ఖరీదైనదిగా, నాణ్యమైనదిగా, ప్రత్యేకమైనదిగా కనిపించేలా చేయవచ్చు. అంటే ధర నిర్ణయించే విధానం ప్రొడక్ట్ రకం, టార్గెట్ కస్టమర్లు, మార్కెట్ పరిస్థితులు, బ్రాండ్ ఇమేజ్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
మొత్తంగా చూస్తే.. రూ.499, రూ.799, రూ.999 వంటి ధరలు కేవలం ఒక్క రూపాయి తగ్గించి చూపించేందుకు మాత్రమే కాదు. వినియోగదారుల మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సైకాలజికల్ ప్రైసింగ్ వ్యూహం. కాబట్టి షాపింగ్ చేసేటప్పుడు ధర చివర్లో 9 ఉందని మాత్రమే అట్రాక్ట్ కాకుండా, అసలు ఉత్పత్తి ధర, నాణ్యత, ఇతర చోట్ల ధరలను కూడా పోల్చి చూడటం మంచిది.