ఇంతకీ ఈ యాడ్‌లో ఏముందంటే..
పాలసీ బజార్ అనేది ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న సంస్థగా ఈ కంపెనీకి పేరు ఉంది. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతోన్న ఛాంపియర్న్ ట్రోఫీ సందర్భంగా ఈ సంస్థ ఒక కొత్త ప్రకటనను విడుదల చేసింది. ఇందులో భర్తను కోల్పోయిన భార్య.. తన భర్త టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడంలో విఫలమయ్యాడని నిరాశను వ్యక్తం చేస్తుంది.
దండ వేసున్న ఫొటో ముందు కూర్చొని నువ్వు టర్మ్ పాలసీ తీసుకుంటే ఉంటే మా జీవితాలు ఇలా ఉండేవా కావు కదా.? అన్న అర్థం వచ్చేలా ఆమె మాటలు ఉంటాయి. 'ఇప్పుడు నేను పిల్లల స్కూల్ ఫీజులు ఎలా కట్టాలి.? ఇంటి ఖర్చులు కూడా ఉన్నాయి.? అంటూ ఆ మహిళ ప్రకటనలో చెబుతుంది. ఇదిగో ఈ మాటలే ఇప్పుడు చర్చకు దారి తీశాయి.
సోషల్ మీడియా వేదికగా ఈ యాడ్‌పై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. ప్రకటనలు అనేవి క్రియేటివిటీ ఉండాలి, అంత వరకు బాగానే ఉంది కానీ మరీ ఇలా భయ పెట్టేవిగా ఉండడం సరైంది కాదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ యాడ్ మరీ భయపెట్టేలా ఉందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం సరైందే కానీ.. మరీ ఇంత దారుణంగా భయపెట్టేలా ఉండడం ఏమాత్రం మంచిది కాదంటూ స్పందిస్తున్నారు వెంటనే ఈ ప్రకటనను ఆపేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై పాలసీ బజార్ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.
వివాదానికి కారణమైన యాడ్ వీడియో చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.