Maruti Fronx: మారుతి ఫ్రాంక్స్‌పై రూ.లక్షల్లో తగ్గింపు! వినియోగదారులకు పండగే

Published : Feb 27, 2025, 02:41 PM IST

Maruti Fronx: మారుతి సుజుకి ఫ్రాంక్స్ పై కంపెనీ రూ.లక్షల్లో డిస్కౌంట్ ప్రకటించింది. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ఇక్కడ ఆ కారణంతో పాటు కారు ధర, తగ్గింపు, ఫీచర్లు, మైలేజీ తదితర వివరాలు కూడా తెలుసుకుందాం రండి.

PREV
14
Maruti Fronx: మారుతి ఫ్రాంక్స్‌పై రూ.లక్షల్లో తగ్గింపు! వినియోగదారులకు పండగే

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకికి చెందిన చాలా కార్లు సీఎస్డీలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆ కంపెనీ తన కాంపాక్ట్ SUV ఫ్రాంక్స్‌ను కూడా CSD(క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్‌)లో అందుబాటులోకి తెచ్చింది. దీని కారణంగా ఈ కారుపై భారీ తగ్గింపు లభిస్తోంది.

CSD అంటే క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్‌. అంటే ఈ కేటగిరీలో 28% కి బదులుగా 14% జీఎస్టీ మాత్రమే వసూలు చేస్తారు. ఫ్రాంక్స్ లాంచ్ అయిన మొదట్లోనే భారతీయ కార్ల మార్కెట్‌లో విజయం సాధించింది. ప్రతి నెల ఈ కారు అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 కార్ల జాబితాలో నిలుస్తోంది. 

24

ఈ కారు కొంటే ఎంత ఆదా చేయొచ్చు

మారుతి ఫ్రాంక్స్ CSDలో అందుబాటులో ఉంది. ఇందులో గరిష్టంగా రూ.1.12 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే దేశంలోని సైనిక సిబ్బంది, రిటైర్డ్ సైనికులు, సైనికుల వితంతువులు, మాజీ సైనికులు మాత్రమే CSD షోరూమ్స్ లో వాహనాలు కొనగలరు. కానీ సాధారణ వ్యక్తులు ఈ కారు కొనాలంటే మార్కెట్ లో దీని ధర రూ.7.52 లక్షల నుంచి రూ.13.04 లక్షల మధ్య ఉంది. CSD షోరూమ్స్ లో ఈ ధరపై సుమారు రూ.1.12 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ కారు ప్రత్యేకతలు, ఇంజిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

34

ఇంజిన్ పవర్

ఫ్రాంక్స్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.0L పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఫ్రాంక్స్‌లో 1.2L K-సిరీస్ అడ్వాన్స్‌డ్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ AGS గేర్‌బాక్స్ ఉన్నాయి. ఫ్రాంక్స్‌ను CNGలో కూడా కొనవచ్చు. ఇందులో స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ ఉంది. 
 

44

స్పోర్టీ లుక్ దీని ప్రత్యేకత

ఫ్రాంక్స్ పొడవు 3,995 మి.మీ, వెడల్పు 1,765 మి.మీ, ఎత్తు 1,550 మి.మీ. ఈ కారులో 308 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. భద్రత కోసం ఈ కారులో EBD టెక్నాలజీ, 6 ఎయిర్‌బ్యాక్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. మరో విషయం ఏంటంటే.. ఈ కారు చూడటానికి స్టోర్టీ లుక్ లో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. 

click me!

Recommended Stories