petrol diesel prices todays:పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. మీ నగరంలో లీటరు ధర ఎంతో తెలుసుకోండి

First Published Nov 18, 2021, 1:09 PM IST

నేడు నవంబర్ 18న గురువారం పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ స్థిరంగా ఉన్నాయి. ఆటో ఇంధనాల ధరలు(fuel prices) యథాతథంగా  కొనసాగడం వరుసగా 15వ రోజు. దీపావళి(diwali) ముందు వరకు పరుగులు తీసిన ఇంధన ధరలపై  కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం(excise tax) తగ్గింపును  నవంబర్ 4న ప్రకటించింది.

  ఎక్సైజ్ సుంకం తగ్గించిన తర్వాత పెట్రోల్‌(petrol) ధర పై లీటరుకు రూ.5, డీజిల్‌(diesel) ధరపై లీటరుకు రూ.10 దిగోచ్చింది. పెట్రోలు, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వచ్చింది. తరువాత  దేశంలోని పలు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్నును ప్రకటించాయి, దీంతో ఆయా ప్రాంతాల్లో ఇంధన ధరలు మరింత తగ్గాయి.
 

14 రోజులు గడుస్తున్నా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో వినియోగదారులకు భారీ ఊరట లభిస్తోంది.

కేంద్రం  ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.103.97కు చేరగా, నేడు కూడా అదే విధంగా కొనసాగుతోంది. మరోవైపు లీటర్ డీజిల్ ధర రూ.86.67గా ఉంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం ఇంధన ధరలపై ఎలాంటి వ్యాట్ తగ్గింపును ప్రకటించలేదు.

 ముంబైలో పెట్రోలు ధర రూ.109.98 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.89.79. చెన్నైలో కూడా లీటర్ పెట్రోల్ ధర రూ.101.40, డీజిల్ ధర రూ.91.43గా ఉంది.  
 

లడఖ్, కర్ణాటక, పుదుచ్చేరి, జమ్మూ & కాశ్మీర్, సిక్కిం, మిజోరం, హిమాచల్ ప్రదేశ్, డామన్ & డయ్యూ, దాద్రా & నాగ్ర్ హవేలీ, చండీగఢ్, అస్సాం, మధ్యప్రదేశ్, త్రిపుర, గుజరాత్, నాగాలాండ్, పంజాబ్, గోవా, మేఘాలయ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అండమాన్ & నికోబార్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాలు/యూటీలు అదనపు వ్యాట్ ప్రయోజనాలను పొడిగించింది.

పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించిన రెండవ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించింది. అయితే కొన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించలేదు.

హైదరాబాద్ లో పెట్రోలు లీటరు ధర రూ.108.20 ఉండగా డీజిల్ ధర లీటరుకు రూ.94.62గా ఉంది.

మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధర ఎంత ఉందో తెలుసుకోండి

మీరు SMS ద్వారా కూడా  పెట్రోల్, డీజిల్ ధర తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం, మీరు RSP మరియు మీ సిటీ కోడ్‌ని వ్రాసి 9224992249 నంబర్‌కు పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది, మీరు IOCL వెబ్‌సైట్ నుండి పొందుతారు.

పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సమీక్షిస్తారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్ డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తర్వాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది.
తాజా ఇంధన ధరల కోసం https://iocl.com/Products/PetrolDieselPrices.aspx క్లిక్ చేయండి
 

click me!