Petrol-diesel prices today:వాహనదారులకు రిలీఫ్.. పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. లీటరు ధర ఎంతంటే..?

First Published May 21, 2022, 9:14 AM IST

చమురు కంపెనీలు మే 21న పెట్రోల్-డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. ఈరోజు వరుసగా 45వ రోజు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత ఒకటిన్నర నెలలుగా వీటి ధరలు స్థిరంగా ఉన్నాయి. చివరిసారిగా ఈ రెండింటి ధరలను ఏప్రిల్ 6వ తేదీన పెంచారు. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాస్త ఊరట లభించింది. 

మరోవైపు దేశ రాజధాని నుండి తెలంగాణ వరకు ఎన్నో నగరాల్లో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలు పెరిగాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో సీఎన్‌జీ గ్యాస్ ధరలు కిలోకు రూ.2 చొప్పున పెరిగాయి. పెరిగిన ధరలు ఈరోజు 21 మే 2022 ఉదయం 6 గంటల నుండి అమలులోకి రానుంది.

గత  16 రోజులలో లీటరుకు మొత్తంగా రూ.10కి పెంపుదల జరిగింది. పెట్రోలు, డీజిల్ ధరలు మార్చి 22 నుండి ఏప్రిల్ 6 మధ్య 14 సార్లు పెంచబడ్డాయి.
 

రాష్ట్ర ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.105.41 కాగా డీజిల్ ధర రూ.96.67 . గురుగ్రామ్‌లో, ఒక లీటర్ పెట్రోల్ ధర రూ.105.86, ఒక లీటర్ డీజిల్ రూ.97.10గా ఉంది.

చెన్నైలో పెట్రోల్ ధర  రూ.110.85, డీజిల్ ధర లీటరుకు  రూ.110.85 వద్ద ఉన్నాయి. కోల్‌కతాలో పెట్రోల్ ధర  రూ.115.12, డీజిల్ ధర  రూ.99.83 . బెంగళూరులో ఒక లీటర్ పెట్రోల్ ధర  రూ.111.09, ఒక లీటర్ డీజిల్  రూ.94.79.

ధరలు భారీగా పెరిగినప్పటికీ గత నెలల్లో పెట్రోల్, డీజిల్ వినియోగం పెరిగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

గత నెలతో పోలిస్తే ఏప్రిల్‌లో పెట్రోల్ వినియోగం 14 శాతం పెరిగిందని, ఈ కాలంలో డీజిల్ వినియోగం 2 శాతం పెరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

పెట్రోలియం ఉత్పత్తుల అధిక ధరలపై, ప్రపంచ పరిస్థితి అదుపులోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని వర్గాలు తెలిపాయి.

ఇంధన ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు మారుతుంటాయి. విదేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తుంటారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించిన తర్వాత ధరలను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి.
 

ఒక్కో నగరంలో వేర్వేరు రేట్లు ఎందుకు?
ప్రతి నగరంలో పెట్రోల్ ధరలలో తేడా రావడానికి కారణం పన్నులే. వివిధ రాష్ట్రాల్లో, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రేట్లలో పన్ను వసూలు చేస్తాయి. అలాగే  ప్రతి నగరం ప్రకారం, మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పన్నులు కూడా ఉన్నాయి. దీనిని స్థానిక సంస్థల పన్ను అని కూడా పిలుస్తారు. ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధారంగా వేర్వేరు పన్నులు విధించబడతాయయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 
పెట్రోల్ ధరల్లో సెంట్రల్ ఎక్సైజ్, రాష్ట్ర పన్నుల వాటా 60 శాతం కాగా, డీజిల్ ధరలో 54 శాతంగా ఉన్నాయి. పెట్రోల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం లీటర్‌కు రూ. 32.90, డీజిల్‌పై లీటర్‌కు రూ.31.80. పెట్రోలు, డీజిల్ ధరలు సాధారణంగా ప్రతిరోజూ మారుతాయి, ఈ ధరలు బెంచ్‌మార్క్ అంతర్జాతీయ ముడి ధరలు, విదేశీ మారకపు ధరల ఆధారంగా నిర్ణయించబడతాయి.

హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 119.47 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.105.47గా ఉంది.
 

click me!