Air India:గాలీలో అకస్మాత్తుగా ఆగిపోయిన విమానం ఇంజిన్.. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్..

Ashok Kumar   | Asianet News
Published : May 20, 2022, 06:22 PM IST

ఎయిర్ ఇండియాకు చెందిన A320neo విమానం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. టాటా గ్రూప్ నడుపుతున్న విమానయాన సంస్థకు చెందిన ఈ విమానం టేకాఫ్ తర్వాత ముంబై విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. అయితే సాంకేతిక సమస్య కారణంగా ఇంజిన్‌లలో ఒకటి గాలిలో ఆగిపోయింది. 

PREV
13
Air India:గాలీలో అకస్మాత్తుగా ఆగిపోయిన విమానం ఇంజిన్.. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్..

27 నిమిషాల తర్వాత
ఈ విషయంపై నివేదికలో గురువారం విమానం టేకాఫ్ అయిన 27 నిమిషాల తర్వాత విమానాశ్రయానికి తిరిగి వచ్చిందని  పేర్కొంది. మరొక విమానంలో  ప్రయాణికులను బెంగళూరులోని వారి గమ్యస్థానానికి చేర్చినట్లు ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ విచారణ జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిర్ ఇండియా  A320neo విమానాలు CFM లీప్ ఇంజిన్‌తో ఉంటాయి.

23

నివేదిక ప్రకారం, A320neo విమానం ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానం టేకాఫ్ అయిన నిమిషాల తర్వాత 9.43 గంటలకు ఇంజిన్ వైఫల్యం  గురించి పైలట్‌లకు సమాచారం అందింది. గాలిలో ఇంజిన్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో విమాన పైలట్ 10.10 గంటలకు ముంబై విమానాశ్రయంలో విమానాన్ని హడావిడిగా దింపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

33

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ప్రతినిధి స్పష్టం చేస్తూ ఎయిర్ ఇండియా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, మా సిబ్బంది ఇలాంటి పరిస్థితులను చక్కగా నిర్వహించడంలో ప్రావీణ్యం కలిగి ఉన్నారని చెప్పారు. మా ఇంజనీరింగ్ అండ్ నిర్వహణ బృందాలు వెంటనే సమస్యను పరిశీలించడం ప్రారంభించాయి, దీంతో అత్యవసర ల్యాండింగ్‌కు దారితీసింది అని అన్నారు.

click me!

Recommended Stories