పండగ ముందు వాహనదారులకు రిలీఫ్.. పెట్రోల్, డీజిల్ లీటరు ఎంతంటే..?

First Published Oct 13, 2021, 12:29 PM IST

వాహనదారులకు నేడు ఇంధన ధరల్లో ఉపశమనం లభించింది. వరుస ఏడు రోజుల పాటు ఇంధన ధరలు పెరిగిన తర్వాత మంగళవారం, బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ పెరిగినప్పటికీ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల సవరణ జరగలేదు. దీంతో ఇంధన ధరల పెంపుకి వరుసగా రెండు రోజు కూడా బ్రేక్ పడింది. 

ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 104.44, డీజిల్ ధర 93.17. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ .110.41. డీజిల్ ధర లీటరుకు రూ .101.03.  కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 105.09, డీజిల్ ధర రూ .96.28. చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 101.79 కి చేరుకుంది, డీజిల్ ధర రూ. 97.59 గా ఉంది. 


భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు
గత ఏడు రోజులుగా ఇంధన ధరలు పెంపు  తరువాత మంగళవారం, బుధవారం స్థిరంగా నిలిచిపోయాయి, కానీ పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. 

పెట్రోల్ ధరలు గత 14 రోజుల్లో 12 రోజులకు పెరిగాగ లీటరు ధర రూ. 3.25 పెరిగింది.మంగళవారం విరామానికి ముందు గత 18 రోజుల్లో 15 రోజులు డీజిల్ ధరలు పెరిగాయి దీంతో లీటరుకు రూ. 4.55 పెరిగింది.  హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.108.64, డీజిల్ ధర రూ.101.66గా ఉంది. అయితే  హైదరాబాద్‌లో మొదటిసారి డీజిల్ రూ.101 దాటింది.

పెట్రోల్ తో పాటు డీజిల్ ధర భారీగా పెరుగుతుండటంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో డీజిల్ ధర లీటరుకు రూ .100 కి పైగా చేరింది. డీజిల్ కంటే ముందుగానే  పెట్రోల్ ధర కొన్ని నెలల క్రితం దేశవ్యాప్తంగా రూ .100 దాటింది.

గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.29 శాతం పెరిగి 83.89 డాలర్లకు చేరుకుంది.  నివేదిక ప్రకారం సెప్టెంబర్ 5 నుండి పెట్రోల్, డీజిల్ ధరలు రెండింటినీ సవరించినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధర బ్యారెల్‌కు సగటున 9-10 డాలర్లు అధికంగా ఉంది.
చమురు కంపెనీలు ఆమోదించిన ధరల ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలను ఉదయం సమీక్షితుంటారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. డీజిల్ ధరలు ఇటీవల పన్నెండుసార్లు, పెట్రోల్ ధరలు పదిసార్లు పెరిగాయి.పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. రెండు నెలలకు పైగా స్థిరంగా లేదా స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు గత నెల చివరి నుండి మళ్లీ పెరగడం ప్రారంభమైంది.

click me!