గత నెల జూలై, ఆగస్టులలో అంతర్జాతీయ చమురు ధరలు తగ్గినప్పుడు ఢిల్లీ మార్కెట్‌లో పెట్రోల్ రూ. 0.65, డీజిల్ రూ .1.25 రిటైల్ ధరలు తగ్గించబడ్డాయి. అంతకు ముందు మే 4 నుండి జూలై 17 మధ్య పెట్రోల్ ధర రూ .11.44 పెరిగింది. అలాగే డీజిల్ ధర రూ. 9.14 పెరిగింది.
ఈ కాలంలో ధరల పెంపుతో దేశంలోని సగానికి పైగా నగరాలలో పెట్రోల్ ధరలు సెంచరీ దాటేశాయి. కొన్ని రాష్ట్రాల్లో డీజిల్ ధర లీటరుకు రూ.100 మార్క్ దాటింది. భారతదేశం దాదాపు 85 శాతం చమురు అవసరాలను తీర్చడానికి దిగుమతులపై ఆధారపడి ఉంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 26 పైసలు పెరగడంతో రూ.105.74కు చేరింది. డీజిల్ ధర 32 పైసలు పెరుగుదలతో రూ.98.06కు ఎగసింది.