ఆల్-టైమ్ రికార్డు స్థాయికి ఇంధన ధరలు.. నేడు లీటరుకు ఎంత పెరిగిందో తెలుసుకోండి..

First Published Oct 4, 2021, 11:24 AM IST

గత నాలుగు రోజుల పాటు ఇంధన ధరలు  వరుసగా పెరిగిన తరువాత దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధర ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నేడు అక్టోబర్ 4 సోమవారం ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓ‌ఎం‌సిలు) ఇంధనాల ధరల పెంపుకు బ్రేక్ ఇచ్చాయి. 

గత 10 రోజుల్లో ప్రభుత్వరంగ ఇంధన కంపెనీలు మొత్తం ఎనిమిది రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దీంతో లీటర్ డీజిల్  పై రూ .2 , పెట్రోల్  పై రూ.1 పెరిగింది.

దేశ రాజధానిలో పెట్రోల్ ధర ఎన్నడూ లేనంతగా రూ. 102.39 కి పెరిగింది, డీజిల్ ధర కూడా అత్యధికంగా రూ .90.77 కు చేరుకున్నాయి. అక్టోబర్ 3 ఆదివారం ఢిల్లీలో  ఇంధనాల ధరలు స్థిరంగా ఉన్నాయి .

ప్రస్తుతం ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 108.43 కాగా, డీజిల్ లీటరుకు రూ .98.48 వద్ద ఉంది,  ఇతర మెట్రో నగరాల కంటే పెట్రోల్ ధర ముంబైలో అత్యధికంగా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్‌ లీటరుకు రూ. 103.07, డీజిల్ ధర రూ. 93.87కి చేరింది.  చెన్నైలో పెట్రోల్ ధర రూ .100.01, డీజిల్ ధర రూ. 95.31గా ఉంది.


కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్, స్థానిక పన్నులను బట్టి ఇంధన ధరలు రాష్ట్రం నుండి రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి.  

petrol, Diesel

సోమవారం  నాటికి బ్రెంట్ క్రూడ్ 24 సెంట్లు (0.3 శాతం) తగ్గి బ్యారెల్‌కు 79.04 డాలర్ల వద్ద ఉంది. గత వారం 1.5 శాతం పెరిగింది. యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) క్రూడ్ ఫ్యూచర్స్ గత ఆరు వారాలుగా పెంపు తర్వాత 27 సెంట్లు (0.4 శాతం) తగ్గి 75.61 డాలర్లకు పడిపోయిందని నివేదిక పేర్కొంది.

దేశంలోని కొన్ని నగరాల్లో డీజిల్ మరియు పెట్రోల్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

ముంబై

పెట్రోల్ - లీటరుకు రూ. 108.43

డీజిల్ - లీటరుకు రూ .98.48

ఢిల్లీ

పెట్రోల్ - లీటరుకు రూ. 102.39

డీజిల్ - లీటరుకు రూ .90.77

Petrol diesel

చెన్నై

పెట్రోల్ - లీటరుకు రూ .100.01

డీజిల్ - లీటరుకు రూ .95.31

కోల్‌కతా

పెట్రోల్ - లీటరుకు రూ. 103.07

డీజిల్ - లీటరుకు రూ. 93.87

భోపాల్

పెట్రోల్ - లీటరుకు రూ .110.63

డీజిల్ - లీటరుకు రూ .99.41

హైదరాబాద్

పెట్రోల్ - లీటరుకు రూ. 106.51

డీజిల్ - లీటరుకు రూ .99.04

బెంగళూరు

పెట్రోల్ - లీటరుకు రూ. 105.95

డీజిల్ - లీటరుకు రూ .96.34
 
ఈ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ .100 దాటింది,
మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిషా,  జమ్మూ కాశ్మీర్, లడఖ్ లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ముంబైలో పెట్రోల్ ధర అత్యధికంగా ఉంది. 
 
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తుంటారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమీషన్ ఇతర జోడించిన తర్వాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ పరిమితుల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి.  

click me!