బిఈఎంఎల్, షిప్పింగ్ కార్ప్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణను మూసివేయాలని, 2022 మార్చి వరకు ప్రభుత్వ యాజమాన్యంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ను స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తుహిన్ కాంత పాండే చెప్పారు. బీపీసీఎల్ పెట్టుబడుల ఉపసంహరణ పరిశీలన దశలో ఉందని పాండే అన్నారు .
"డిసెంబర్-జనవరిలో ఎన్‌ఐఎన్‌ఎల్, ఎస్‌సిఐ, బిఈఎంఎల్, పవన్ హన్స్ కోసం ఫైనాన్షియల్ బిడ్‌లను ఆశించవచ్చు" అని తుహిన్ కాంత పాండే చెప్పారు. అలాగే డిసెంబర్‌లో ఎయిర్ ఇండియా(air india)ను టాటా గ్రూప్(tata group)కు అప్పగించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.