ఇంధన ధరల అప్ డేట్.. ఇక్కడ అతితక్కువ ధరకే పెట్రోల్ డీజిల్.. ఇవాళ్టి రేట్లు ఇవే..

First Published | Nov 29, 2023, 9:05 AM IST

నేడు పెట్రోల్ డీజిల్ ధరలను జాతీయ ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ అప్‌డేట్ చేసాయి. ఈరోజు అంటే 29 నవంబర్ 2023న లేటెస్ట్  అప్‌డేట్ ప్రకారం, జాతీయ స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే, కొన్ని రాష్ట్రాల్లో స్వల్ప ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. 

క్రూడాయిల్  గురించి చెప్పాలంటే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్  ధరల్లో నిరంతరం హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈరోజు నవంబర్ 29న బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $81.60 ఉండగా WTI క్రూడ్ బ్యారెల్‌కు $76.52గా ఉంది. ఢిల్లీ  మెట్రో నగరాలతో సహా  పరిసర ప్రాంతాల్లో ఈ రోజు పెట్రోల్  డీజిల్ ధర ఎంతో తెలుసుకుందాం...

petrol pump

ఢిల్లీ నుండి హైదరాబాద్  వరకు పెట్రోల్  డీజిల్ ధరలు?
దేశ రాజధాని ఢిల్లీలో నేటికీ లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా, లీటర్ డీజిల్ ధర రూ.89.62గానూ కొనసాగుతున్నట్లు ఐఓసీఎల్ వెల్లడించింది. దీనితో పాటు, దేశ ఆర్థిక రాజధాని ముంబై గురించి మాట్లాడినట్లయితే, ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ లీటరుకు రూ. 94.27 వద్ద స్థిరంగా ఉంది. దీంతో పాటు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63గా, డీజిల్ ధర రూ.94.24గా కొనసాగుతోంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76.
 


బెంగళూరు లీటర్ పెట్రోల్ ధర రూ. 101.94, లీటర్ డీజిల్ ధర రూ. 87.89

చండీగఢ్ లీటర్ పెట్రోల్ ధర రూ. 96.20, లీటర్ డీజిల్ ధర రూ. 84.26

గురుగ్రామ్ లీటర్ పెట్రోల్ ధర    రూ. 96.84, లీటర్ డీజిల్ ధర రూ. 89.72

లక్నో లీటర్ పెట్రోల్ ధర    రూ. 96.57, లీటర్ డీజిల్ ధర రూ. 89.76

నోయిడా లీటర్ పెట్రోల్ ధర రూ. 96.79, లీటర్ డీజిల్ ధర రూ. 89.96

 పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04గా ఉంది.
 
పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర  రూ.109.66,  డీజిల్ లీటరు ధర  రూ.97.82గా ఉంది.

ప్రతిరోజు ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తూ  కొత్త రేట్లు విడుదల చేస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర  జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌ను మనం ఇంత ఎక్కువకు కొనుగోలు చేయాల్సి రావడానికి ఇదే కారణం.

ఇంట్లో కూర్చొని కూడా పెట్రోల్, డీజిల్ ధరలను SMS  ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఇండియన్ ఆయిల్ వినియోగదారులు అయితే, RSP అండ్  మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు SMS పంపండి, BPCL వినియోగదారులు  RSP అండ్  సిటీ కోడ్‌ని  టైప్ చేసి 9223112222 నంబర్‌కు SMS పంపాలి. దీని తర్వాత మీకు SMS ద్వారా మొత్తం సమాచారం ఇవ్వబడుతుంది. HPCL వినియోగదారులు HPPrice అండ్  సిటీ కోడ్‌ని టైప్ చేసి  9222201122కు SMS  పంపాలి.
 

కరాచీ - తాత్కాలిక ఫెడరల్ ప్రభుత్వం నవంబర్ 2023 ద్వితీయార్థంలో పెట్రోల్ అండ్  హై-స్పీడ్ డీజిల్ (HSD) ధరలలో మార్పులు చేసింది .

ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ సిఫారసు మేరకు ఇంధన ఉత్పత్తుల ధరలను రూ.9.01 వరకు తగ్గించినట్లు ఆర్థిక విభాగం తెలిపింది.

పెట్రోలు ధర లీటరుకు రూ.281.34కు తగ్గగా, హైస్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డి) కొత్త ధర రూ.296గా నిర్ణయించారు.
 

Latest Videos

click me!