నేడు ఛత్తీస్‌గఢ్‌లో పెట్రోల్ ధర 50 పైసలు, డీజిల్ ధర 49 పైసలు పెరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లో పెట్రోల్ ధర 55 పైసలు, డీజిల్ ధర 49 పైసలు పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధర 27 పైసలు పెరిగింది. అదేవిధంగా ఉత్తరాఖండ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మరోవైపు, రాజస్థాన్‌లో పెట్రోల్ 30 పైసలు, డీజిల్ 27 పైసలు తగ్గింది. అంతేకాకుండా, మహారాష్ట్ర, బీహార్, తెలంగాణలో కూడా పెట్రోల్ డీజిల్ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.