బంగారం, వెండి తగ్గేదే లే.. పెళ్లిళ్ల సీజన్లో చుక్కలు చూపిస్తున్న ధరలు.. ఇవాళ ఒక్కరోజే ఎంత పెరిగిందంటే..?

First Published | Nov 28, 2023, 10:59 AM IST

దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్‌ కొనసాగుతోంది, ఈ కాలంగా బంగారం ధర నిరంతరం పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. దింతో పెళ్లిళ్లకు బంగారు ఆభరణాలు కొనాలనే ఆలోచనలో ఉన్నవారు ఎక్కువ ధర చెల్లించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పెళ్లిళ్ల  కారణంగా దేశీయ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ బాగా పెరిగింది. 
 

 పండుగ సీజన్  సందర్భంగా గడిచిన రెండు నెలల్లో బంగారం ధర గణనీయంగా పెరగడం గమనార్హం. గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 27 సోమవారం బులియన్ మార్కెట్లు మూసివేయబడ్డాయి, 

రానున్న రోజుల్లో పెళ్లిళ్ల  సీజన్ కొనసాగుతుండటంతో బంగారం ధరలు మరోసారి పెంపును  చూస్తున్నాయి.  అయితే బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరగడం వివాహ బడ్జెట్‌ను మరింత అధికంగా చేస్తుంది.

ఒక నివేదిక  ప్రకారం, మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 పెరిగింది, దింతో పది గ్రాముల  ధర  రూ. 62,560. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.250 పెరిగి రూ.57,350గా ఉంది. వెండి ధర కూడా రూ. 1,300 పెరిగి ఒక కిలోకి రూ. 78,500కి చేరింది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా ధరలతో సమానంగా రూ.62,560గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,710, 

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,560, 

 చెన్నైలలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.63,050గా ఉంది.


ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా ధరలతో సమానంగా రూ.57,350 వద్ద ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.57,500, 

 బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350, 

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,800గా ఉంది.  

 స్పాట్ గోల్డ్  01:35 GMT నాటికి ఔన్స్‌కు 0.7 శాతం పెరిగి $2,015.09కి చేరుకుంది. స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 1.9 శాతం పెరిగి 24.76 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.1 శాతం పెరిగి 931.49 డాలర్లకు చేరుకుంది. పల్లాడియం ఔన్స్‌కు 0.6 శాతం పెరిగి 1,074.94 డాలర్లకు చేరుకుంది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.78,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.81,500 వద్ద ట్రేడవుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు నేడు  పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 260  పెంపుతో రూ. 57,360 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 పెంపుతో రూ. 62,570. విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ.81,500.

 విజయవాడలో కూడా బంగారం ధరలు పెరిగాయి. రేట్ల ప్రకారం చూస్తే, ఈరోజు  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 260  పెంపుతో రూ. 57,360, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 పెంపుతో రూ. 62,570. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర  కిలోకు రూ.81,500.

 హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 260 పెంపుతో  రూ. 57,360  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 280 పెంపుతో రూ. 62,570. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ. 81,500.

ఇక్కడ పేర్కొన్న బంగారం రేట్లు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, ధరలు ప్రతి క్షణం మారవచ్చు, అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.  

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నవంబర్ 27 సోమవారం నాడు బంగారం  ఔన్స్ స్థాయి 2,000 డాలర్లు దాటిన తర్వాత బంగారం ధరలు గ్రాముకు ఒక దిర్హామ్ పెరిగాయి.

దుబాయ్ జ్యువెలరీ గ్రూప్ డేటా సోమవారం సాయంత్రం గ్రాముకు 24 క్యారెట్ల బంగారం ధర దిర్హామ్‌లు 243.50 వద్ద ట్రేడింగ్‌ను చూపింది, అంటే సుమారు రూ.5,528.48 . 

Latest Videos

click me!