సామాన్యులకు రిలీఫ్.. స్థిరంగా పెట్రోల్ డీజిల్.. నేడు లీటరు ధర ఎంతంటే..?

First Published | Aug 28, 2023, 9:00 AM IST

నేడు   ఆగస్టు 28 సోమవారం రోజున  దేశ రాజధాని న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని నెలలుగా ఇంధన ధరలు  మారలేదు. అయితే, ఒక్కొక్క నగరాలలో  ప్రతిరోజూ వీటి ధరలలో హెచ్చుతగ్గులను చూస్తాయి.
 

 పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. 

మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు  ?

ఢిల్లీలో గురువారం పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.  ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76.

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను తగ్గించగా, కొన్ని పెట్రోల్ మరియు డీజిల్‌పై సెస్ విధించాయి.

పెట్రోల్  డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం... 

 భోపాల్ లో పెట్రోల్   ధర రూ.108.65, డీజిల్ ధర రూ.93.90

రాంచీలో  పెట్రోల్   ధర    రూ.99.84, డీజిల్ ధర రూ.94.65

బెంగళూరులో  పెట్రోల్   ధర రూ.101.94,  డీజిల్ ధర రూ.87.89

పాట్నాలో పెట్రోల్   ధర రూ.107.24,  డీజిల్ ధర రూ.94.04

చండీగఢ్ లో పెట్రోల్   ధర రూ.96.20,  డీజిల్ ధర రూ.84.26

లక్నోలో పెట్రోల్   ధర రూ.96.57,  డీజిల్ ధర రూ.89.76

నోయిడాలో పెట్రోల్   ధర     రూ.96.79,  డీజిల్ ధర రూ.89.96

హైదరాబాద్: పెట్రోల్ ధర రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82


Petrol

ఈ నెల ప్రారంభంలో   పెట్రోల్  డీజిల్‌పై  అధికంగా  పన్నులు విధించడం ద్వారా కేంద్రం లబ్ధి పొందుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. అంతర్జాతీయంగా తగ్గిన ముడిచమురు ధరల ప్రయోజనాలను ప్రజలకు అందించాలని కాంగ్రెస్ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కోరారు. దీని వల్ల "బ్యాక్ బ్రేకింగ్ ద్రవ్యోల్బణం" భారాన్ని తగ్గించగలదని వారు వాదించారు. కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి (ఇన్‌చార్జ్, కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ హిందీలో మాట్లాడుతూ, గత యుపిఎ ప్రభుత్వ హయాంలో పన్ను స్థాయిల లాగానే  పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.25-30 తగ్గించడం ద్వారా ఉపశమనం కలిగించే సామర్థ్యం కేంద్రానికి ఉందని అన్నారు. 

సోమవారం మార్కెట్ ప్రారంభానికి ముందు అందుబాటులో ఉన్న ట్రెండ్‌ల ప్రకారం, బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $0.25 లేదా 0.30 శాతం పెరిగి $84.73 వద్ద ట్రేడవుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లేదా WTI క్రూడ్ కూడా $0.28 లేదా 0.35 శాతం పెరిగి బ్యారెల్ $80.11 వద్ద ట్రేడవుతోంది.
 

మీ నగరంలో నేటి ధరలను ఇలా తెలుసుకోండి
మన దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలను ప్రతిరోజూ సమీక్షించే  విధానం ఉంది. ఇందులో ఏదైనా మార్పు ఉంటే ఉదయం 6 గంటలకు ధరలు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి. మీరు SMS ద్వారా నేటి పెట్రోల్-డీజిల్ ధరను కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP స్పేస్ పెట్రోల్ పంప్ కోడ్‌ను 9224992249కి, BPCL కస్టమర్‌లు RSP స్పేస్ పెట్రోల్ పంప్ కోడ్‌ను 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice స్పేస్ పెట్రోల్ పంప్ కోడ్‌ను 9222201122కు పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.

Latest Videos

click me!