పెట్రోల్ బంకుకి వెళ్తున్నారా.. మీ వాహనంలో పెట్రోల్, డీజిల్ నింపే ముందు నేటి ధరలు తెలుసుకోండి..

First Published | Aug 26, 2023, 8:23 AM IST

ఈరోజు  ఆగస్టు 25 శుక్రవారంన  దేశ రాజధాని న్యూఢిల్లీ, కోల్‌కతా, ఆర్ధిక రాజధాని ముంబై ఇంకా చెన్నైలో  పెట్రోల్, డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని నెలలుగా ఇంధన  ధరలు మారలేదు. అయితే, ఒక్కొక్క నగరాలు ప్రతిరోజూ వీటి ధరలలో హెచ్చుతగ్గులను చూస్తాయి. 

ఇంకా పెట్రోల్  డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, అప్పట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను తగ్గించగా కొన్ని పెట్రోల్ డీజిల్‌పై సెస్ విధించాయి.

ఈ నెల ప్రారంభంలో  పెట్రోల్  డీజిల్‌పై కనికరం లేకుండా పన్నులు విధించడం ద్వారా కేంద్రం లబ్ధి పొందుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. అంతర్జాతీయంగా తగ్గిన ముడిచమురు ధరల ప్రయోజనాలను ప్రజలకు అందించాలని వారు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కోరారు. ఇది "బ్యాక్ బ్రేకింగ్ ద్రవ్యోల్బణం" భారాన్ని తగ్గించగలదని వారు వాదించారు. కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి (ఇన్‌చార్జ్, కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ హిందీలో మాట్లాడుతూ, గత యుపిఎ ప్రభుత్వ హయాంలో పన్ను స్థాయిల లాగానే పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.25-30 తగ్గించడం ద్వారా ఉపశమనం కలిగించే సామర్థ్యం కేంద్రానికి ఉందని అన్నారు.  
 


ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో పెట్రోలు ధర  లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు రూ. 94.27గా ఉంది. ఇదిలా ఉండగా, కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర లీటరుకు రూ.92.76. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర లీటరుకు రూ.94.24. 
 

Petrol

ఇతర నగరాల్లో ఇంధన ధరలు :
బెంగళూరు:  పెట్రోల్ ధర లీటరుకు రూ. 101.94,  డీజిల్ ధర రూ. 87.89
చండీగఢ్:  పెట్రోలు ధర లీటరుకు రూ. 98.65, డీజిల్ ధర రూ. 88.95
చెన్నై:  పెట్రోలు ధర లీటరుకు రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24
గురుగ్రామ్:  పెట్రోల్ ధర లీటరుకు రూ. 97.04, డీజిల్ ధర రూ. 89.91
కోల్‌కతా:  పెట్రోలు ధర లీటరుకు రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76
లక్నో:  పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76
ముంబై:  పెట్రోలు ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర రూ. 94.27
న్యూఢిల్లీ:  పెట్రోలు ధర లీటరుకు రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62
నోయిడా:  పెట్రోలు ధర లీటరుకు రూ. 96.65, డీజిల్ ధర రూ. 89.82
హైదరాబాద్: పెట్రోల్ ధర రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82
 

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL),  హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ ఆయిల్  మార్కెటింగ్ కంపెనీలు (OMCలు)  అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు ఇంకా ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ   పెట్రోల్ డీజిల్ ధరలను సవరిస్తాయి. పెట్రోల్  డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు  ఉంటే  ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి.  
 

మీ నగరంలో నేటి ధరలను ఇలా తెలుసుకోండి
మన దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలను ప్రతిరోజూ సమీక్షించే  విధానం ఉంది. ఇందులో ఏదైనా మార్పు ఉంటే ఉదయం 6 గంటలకు ధరలు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి. మీరు SMS ద్వారా నేటి పెట్రోల్-డీజిల్ ధరను కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP స్పేస్ పెట్రోల్ పంప్ కోడ్‌ను 9224992249కి, BPCL కస్టమర్‌లు RSP స్పేస్ పెట్రోల్ పంప్ కోడ్‌ను 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice స్పేస్ పెట్రోల్ పంప్ కోడ్‌ను 9222201122కు పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.
 

Latest Videos

click me!