ఇంధన ధరలు పెరగటానికి కారణం ఏంటి.. అసలు ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధర ఎంతో తెలుసా ?

First Published Feb 16, 2021, 7:09 PM IST

ప్రభుత్వ చమురు కంపెనీలు గత కొద్దిరోజులుగా ఇంధన ధరల పెంపును కొనసాగిస్తున్నాయి.  రోజువారీ పెంపుతో చమురు ధరలు కొత్త రికార్డులను బ్రేక్  చేయడంతో పాటు భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ఖరీదైనదిగా మారాయి. మరోవైపు చమురు ధరలను ఆకాశానికి తాకడంతో  ప్రజలు ఇబ్బందులకు  గురవుతున్నారు. వాస్తవానికి భారతదేశంలో వాహన వినియోగదారులు పెట్రోల్, డీజిల్ ధరను ఫ్యాక్టరీ మూల ధర కంటే మూడు రెట్లు  అధికంగా చెల్లిస్తున్నారు. ఇంధనం ఏ విధంగా ఖరీదైనదిగా మారుతుందో  తెలుసుకొండి..

అంతర్జాతీయ మార్కెట్లో 31 రూపాయల పెట్రోల్ కోసం మనం ఇక్కడ రూ. 89 చెల్లిస్తున్నాం. ముడి చమురు ధర తగ్గినప్పటికీ మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధర తగ్గదు.ఫిబ్రవరి 16న దేశ రాజధాని ఢీల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధరబేస్ ధర ఫ్యాక్టరీ ధర 31.82 రూపాయలుసరుకు రవాణా (రవాణా ఖర్చులు) 0.28 రూపాయలుఎక్సైజ్ డ్యూటీ 32.90 రూపాయలుడీలర్ కమిషన్ 3.68 రూపాయలువ్యాట్ (డీలర్ కమీషన్‌తో) 20.61 రూపాయలువినియోగదారుడి ధర రూ .89.29
undefined
ఫిబ్రవరి 16న ఢీల్లీలో ఒక లీటర్ డీజిల్ ధరబేస్ ధర ఎక్స్ ఫ్యాక్టరీ ధర 33.46 రూపాయలుసరుకు రవాణా (రవాణా ఖర్చులు) 0.25 రూపాయలుఎక్సైజ్ డ్యూటీ 31.80 రూపాయలుడీలర్ కమిషన్ రూ .1.51వ్యాట్ (డీలర్ కమీషన్‌తో) 11.68 రూపాయలువినియోగదారుడి ధర 79.70 రూపాయలు
undefined
భారతదేశంలో చమురుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ రకాల పన్నులు చాలా అధికం. అలాగే చమురు పై సెస్ కూడా వినియోగదారుల నుండి వసూలు చేయబడుతుంది. అందుకే మన దేశంలో చమురు ధర అంత ఎక్కువగా ఉంటుంది.
undefined
ప్రపంచ మార్కెట్ల కారణంగా ధరలు ప్రభావితమవుతాయి. దీంతో ఇంధన రిటైల్ ధరలు రాష్ట్ర స్థాయి పన్నులతో సహా అత్యధిక స్థాయికి చేరుకుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు నిరంతరం పెరగటంతో ఇది రిటైల్ ఇంధన అమ్మకాల ధరను నేరుగా ప్రభావితం చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $ 60 దాటింది. అందువల్ల దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధర ఖరీదైనదిగా మారాయి.
undefined
ఏడాది గరిష్టానికి ముడి చమురుకరోనా కాలంలో కూడా చైనా ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది, ఈ కారణంగా అక్కడ ముడి చమురు దిగుమతి జనవరిలో ప్రతిరోజూ 111.2 లక్షల చొప్పున పెరిగింది. ఇది డిసెంబర్ కంటే 18 శాతం ఎక్కువ. ప్రస్తుతం ఇతర దేశల నుండి ముడి చమురు దిగుమతులను పెంచుతున్న తీరు చూస్తే మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా సోమవారం ముడి చమురు ధర పెరిగినట్లు సూచిస్తుంది. సోమవారంతో ముడి చమురు ధర ఈ ఏడాది గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు. 63.74 కు చేరింది, ఇది 23 జనవరి 2020 నుండి అత్యధిక స్థాయి.
undefined
చమురు ధర ఎలా నిర్ణయించబడుతుంది?పెట్రోల్, డీజిల్ ధరలును ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు సావరిస్తారు. ఈ కొత్త ధర ఉదయం 6 గంటల నుండి వర్తిస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర ఖర్చులు జోడించిన తరువాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ ప్రమాణాల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సావరిస్తాయి.
undefined
click me!