వాహనదారులపై పెట్రోల్ పంజా.. నేడు మళ్ళీ పెరిగిన ఇంధన ధరలు..

First Published Oct 14, 2021, 11:54 AM IST

రెండు రోజుల విరామం తర్వాత నేడు పెట్రోల్,  డీజిల్ ధరలు 0.31 నుండి 0.37 పైసలకు పెరిగాయి. దేశ రాజధానిలో పెట్రోల్ (petrol)ధర లీటరుకు రూ.104.79 చేరింది, నిన్నటి కంటే 35 పైసలు పెరిగింది, డీజిల్(diesel) లీటరుకు రూ. 93.52 కి చేరింది. అక్టోబర్‌లో ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు 10 రెట్లు పెరిగాయి.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( HPCL) అంతర్జాతీయ ధర, విదేశీ మారక ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తారు.
 

ముంబైలో పెట్రోల్ ధర ఇప్పటికే అత్యధికంగా చెరీ నేడు లీటరుకు రూ .110.75వద్ద ఉంది, డీజిల్ ధర లీటరుకు రూ. 101.40. ధరల మధ్య వ్యత్యాసం వివిధ రాష్ట్రలో లేదా నగరాల్లో స్థానిక వ్యాట్ ఛార్జీల కారణంగా మారుతుంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు సరుకు ఛార్జీలు, స్థానిక పన్నులు, వ్యాట్ ఆధారంగా నిర్ణయించబడతాయి.  
 

చెన్నై: పెట్రోల్ ధర లీటరుకు రూ. 102.10, డీజిల్ ధర లీటరుకు రూ. 97.93
కోల్‌కతా: పెట్రోల్ ధర లీటరుకు రూ. 105.43, డీజిల్ ధర రూ .96.63
పూనే: పెట్రోల్ ధర రూ .110.29, డీజిల్ ధర లీటరుకు రూ. 99.39 
బెంగళూరు: పెట్రోల్ ధర రూ. 108.44, డీజిల్ ధర లీటరుకు రూ .99.26 
హైదరాబాద్: పెట్రోల్ ధర రూ. 109.00, డీజిల్ ధర లీటరుకు రూ. 102.04

రాయిటర్స్ ప్రకారం, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 83.46 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ బ్యారెల్ 80.66 డాలర్ల వద్ద ఉన్నాయి

చమురు కంపెనీలు గత వారం ఆటో ఇంధన ధరలను పెంచడం ప్రారంభించాయి. ఏడు రోజుల వరుస పెరుగుదల తర్వాత అక్టోబర్ 12, 13 తేదీలలో ధరలపై విరామం వచ్చింది. దీనికి ముందు ధరలు చివరిగా సోమవారం సవరించింది. 

click me!