పాన్ కార్డుతో ఆధార్ లింకింగ్ గడువు మరోసారి పొడిగింపు.. ఈ తేదీలోగా చేయపోతే.. ?

First Published Sep 18, 2021, 4:12 PM IST

కేంద్ర ప్రభుత్వం మరోసారి పాన్-ఆధార్ లింకింగ్ గడువును  పొడిగించింది. అంటే ఇప్పుడు 30 సెప్టెంబర్ 2021 నుండి 31  మార్చి 2022 లోగా పాన్-ఆధార్ లింకింగ్ చేయాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం కింద పెనాల్టీ ప్రొసీడింగ్స్ పూర్తి చేయడానికి గడువును కూడా 30 సెప్టెంబర్ 2021 31 నుండి మార్చి 2022 వరకు పొడిగించినట్లు భారత ప్రభుత్వం తెలిపింది.
 

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఇంతకు ముందు రూల్ 114AAAను  పాన్ పనిచేయని పక్షంలో పరిణామాలను సూచిస్తూ నోటిఫై చేసింది. నియమం ప్రకారం, ఒక వ్యక్తి  పాన్   కార్డ్  పనిచేయని పక్షంలో అతను పాన్‌ని అందించలేదని, తెలియజేయలేదని లేదా పేర్కొనలేదని భావించవచ్చు, అలాగే చట్టం కింద వర్తించే అన్ని పరిణామాలకు అతను బాధ్యత వహించాలి. అయితే ఆ వ్యక్తి ఆధార్‌ను డిపార్ట్‌మెంట్‌కు తెలియజేయడం ద్వారా తన పాన్‌ కార్డును తిరిగి యాక్టివేట్ చేయవచ్చు.
 

ప్రజలు ఎలాంటి అసౌకర్యలను కలగకుండా ఉండాలంటే గడువుకు ముందే ఆధార్‌ని పాన్‌తో లింక్ చేయాలి. ఆధార్ అనేది దేశంలోని ఒక వ్యక్తికి అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది అన్ని అవసరాలకు ఏకైక పరిష్కారంగా మారుతుంది. పాన్‌తో ఆధార్‌ని లింక్ చేయడం ఇప్పుడు చాలా సులభం. కేవలం ఒక ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా కూడా పాన్ తో ఆధార్ లింక్ చేయవచ్చు.

click me!