మనీ గైడ్: మీ భవిష్యత్తును మెరుగ్గా ప్లాన్ చేయడానికి 5 మార్గాలు మీకోసం.. అవేంటో తెలుసుకోండి..

First Published Sep 18, 2021, 1:38 PM IST

రావాల్సిన బకాయిలు లేదా  తాజాగా పెంపును అందుకున్నారా... మీరు  ఈ మొత్తాన్ని పొదుపు చేయాలని ఆలోచిస్తున్నారా.. లేదా ఎక్కడ ఖర్చు చేయాలో తెలియట్లేదా... మీరు 'రిచ్ డాడ్ & పూర్ ఫాదర్ ' , వారెన్ బఫెట్  కోట్స్ లేదా  మీరు చిన్న మొత్తం నుండి అధిక సంపదను సృష్టించే గొప్ప పెట్టుబడిదారుల కథనాలను వినే ఉంటారు.

డబ్బును వృధా చేయడానికి ఎవరు ఇష్టపడరు అలాగే మీరు ఎప్పుడు కోరుకునే  మీ చేతుల్లో ఉండాలనుకునే కొత్త ఫోన్ కొనుగోలును కూడా వొదులుకోలేరు... 

మీరు ఈ 'మనీ గైడ్' నుండి మీ సేవింగ్స్ ఖాతాలో అందుకున్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం లేదా ఖర్చు చేయడం గురించి మీ అన్ని ప్రశ్నలకు పరిష్కారాలను చూపిస్తుంది.... 

చిట్కా #1 - 'టర్మ్ ఇన్సూరెన్స్'

మీకు ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే వెళ్లి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే కోవిడ్-19 మనకు ఒక  గొప్ప విషయం నేర్పింది  అదేంటంటే జీవితం ఎప్పుడైనా ప్రమాదంలో  పడేయవచ్చు మీరు దానిని ఎదుర్కోలేకపోవచ్చు తర్వాత మీ కుటుంబానికి సహాయపడే ఒక ఇన్సూరెన్స్ మీ వద్ద ఉండాలి. 

మీరు  ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తున్నారని 'యూ‌ఎల్‌ఐ‌పి' లేదా 'ప్రీమియం రిటర్నింగ్ ప్లాన్' తీసుకోవట్లేదని  గుర్తుంచుకోవాలి. యూ‌ఎల్‌ఐ‌పిలు ఖరీదైనవి, దాని నుండి డబ్బును ఆదా చేసి  వేరే చోట పెట్టుబడి పెట్టండి. 
 

చిట్కా #2 - 'మెడికల్ ఇన్సూరెన్స్'

ప్రాణాంతమైన కరోనావైరస్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీకు కరోనా వ్యాక్సిన్ అవసరం, కానీ కోవిడ్-19 మాత్రమే మీరు జాగ్రత్త వహించాల్సిన విషయం కాదు. గాల్ స్టోన్స్ , కార్డియాక్ సమస్యలు, గ్లకోమా, లంప్స్, నోడ్స్  ఇవన్నీ కూడా మీ బడ్జెట్‌ను విచ్ఛిన్నం చేసెటివి. మీరు, మీ కుటుంబ సభ్యులను మెడికల్ ఇన్సూరెన్స్‌తో రక్షించడం మంచిది. 

మీ ఆఫీసు మెడికల్ పాలసీపై ఆధారపడకండి, ఎందుకంటే మీరు ఏదో ఒకరోజు మీ ఉద్యోగాన్ని మారవచ్చు. ఒకోసారి ఎవరైనా ఉద్యోగాలు మార్చుతున్నప్పుడు  క్లిష్ట సమయాలని ఎదురుకోవాల్సి ఉంటుంది. ఆసుపత్రులకు సంబంధించిన వ్యవహారాలు ఖరీదైనవి, అందుకే ఆరోగ్య భీమా అందుబాటులో ఉండేల ఉంచుకోండి.
 

చిట్కా #3 - 'పి‌పి‌ఎఫ్'  అంటే  పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్

ముందుగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ను ఓపెన్ చేయండి. మీరు 7.1% వడ్డీని పొందవచ్చు ఇంకా ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో పన్ను ఆదా చేసేందుకు కూడా సహాయపడుతుంది. ప్రస్తుతం పి‌పి‌ఎఫ్ ఖాతాలో ప్రతి సంవత్సరం కనీసం రూ .500 నుండి గరిష్టంగా రూ .1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఒక పి‌పి‌ఎఫ్ ఖాతా 15 సంవత్సరాలలో మెచ్యూర్ చెందుతుంది, ఆ తర్వాత మీరు మీ మొత్తం డబ్బును ఉపసంహరించుకోవచ్చు లేదా పి‌పి‌ఎఫ్ ఖాతాను 5 సంవత్సరాల కోసం బ్లాక్ చేయవచ్చు.
 

చిట్కా #4 - ఇల్లు కొనండి!

ఒక ఇంటిని అద్దెకు తీసుకుని మరింత లాభదాయకమైన ఆఫర్‌లు, పథకాలలో డబ్బును పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చా ?

అవును, అందుకే మీరు తప్పనిసరిగా చిన్న ఇల్లు కొనాలి. అందులోనే ఉండండి లేదా దానిని అద్దెకు ఇవ్వండి, దీని ద్వారా హౌసింగ్ లోన్‌పై వడ్డీని ఆదా చేయడం, మంచి సిబిల్‌ను సృష్టించడం, మీ భావిష్యత్తు రోజుల కోసం ఆస్తిని సృష్టించడం అనే మంచి ఆలోచన ఉంది. ఇది  మీకు సాధారణంగా అనిపించవచ్చు లేదా 'నిపుణుల' సలహా కాకుండొచ్చు, కానీ మీరు ఒక పెట్టుబడిదారుడు. రేపు అమెజాన్ షేర్లను కొనడానికి మీ వద్ద అంత పెద్ద డబ్బు ఉండకపోవచ్చు. అందుకే ఒక చిన్న ఇల్లు కొనండి. డిస్కౌంట్ కోసం పి‌ఎం ఆవాస్ యోజన కూడా చూడండి.
 

చిట్కా #5 - పెట్టుబడి!

మీరు మీకు నచ్చిన మొబైల్ ఇప్పుడు కాకపోయిన ఎప్పుడైనా కొనవచ్చు, కానీ పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. ఇప్పుడు మీకు దగ్గర పెద్దగా డబ్బు లేకపోవచ్చు కానీ  మీరు లేటెస్ట్ మొబైల్ ఫోన్ కొంటె అది మీ బిల్లులను, ఖర్చులను చెల్లించదు. 

ఇప్పుడే మీరు 2వేలతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి, అలాగే కనీసం 6 నెలలు పెట్టుబడి పెట్టండి. మార్కెట్ అస్థిరతలను లేదా ఒడిదుడుకులను గమనించి నేర్చుకోండి. షేర్లు ఇంకా సిప్ మార్గాల గురించి మరింత ప్రయత్నించండి, చదవండి. సహాయం కోసం మీరు ఎఫ్‌బి ద్వారా కూడా కనెక్ట్ కావచ్చు.
మీ ప్రారంభ పెట్టుబడి అద్భివృద్ది కాకపోతే నిరుత్సాహపడకండి. గుర్తుంచుకోండి మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న మొబైల్ ఫోన్ కూడా అదే విధంగా విలువ తగ్గిస్తుంది. కాబట్టి కేవలం ధృడంగా ఉండండి, పెట్టుబడులు పెట్టండి. 

click me!