OnePlus 13 vs iPhone 16 Plus: బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఏదో తెలుసా?

Published : Jan 28, 2025, 04:38 PM IST

మీరు iPhone 16 Plus లేదా OnePlus 13 లో ఏ ఫోన్ కొనాలో అని కన్ఫూజ్ అవుతున్నారా? ఈ రెండూ బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లే. అయితే డిస్‌ప్లే, డిజైన్, కెమెరా, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ, ధర వంటి ముఖ్యమైన అంశాల్లో చిన్న తేడాలు ఉంటాయి. అవేంటే ఇక్కడ వివరంగా తెలుసుకోండి. మీకు బెస్ట్ అనిపించిన ఫోన్ కొనుక్కోండి. 

PREV
16
OnePlus 13 vs iPhone 16 Plus: బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఏదో తెలుసా?

మీరు కాస్త డబ్బులెక్కువైనా మంచి ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? iPhone 16 Plus, OnePlus 13, Galaxy S25 Plus ఫోన్లు మీకు మంచి ఆప్షన్స్. అయితే ఈ మూడు ఫోన్లలో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా మంచిదే అయితే iPhone 16 Plus, OnePlus 13 ల మధ్య తేడాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ రెండు ఫోన్లలో ఏది మంచి ఫోనో తెలియాలంటే మీరు 5 ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోవాలి. 

26

OnePlus 13 vs iPhone 16 Plus: డిస్‌ప్లే

iPhone 16 Plus 6.7-అంగుళాల స్క్రీన్, FHD+ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది.

OnePlus 13 6.82-అంగుళాల 2K 120Hz LTPO స్క్రీన్, క్వాడ్-కర్వ్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది.

iPhone 16 Plusలో పిల్ ఆకారపు కటౌట్‌లో ఫేస్ ID సెన్సార్లు ఉంటాయి.

OnePlus 13లో పంచ్-హోల్ కటౌట్ ఉంది.

36

OnePlus 13 vs iPhone 16 Plus: డిజైన్

iPhone 16 Plus, OnePlus 13 రెండూ గ్లాస్-మెటల్ డిజైన్‌తో వస్తాయి.

OnePlus 13 IP69 రేటింగ్ కలిగి ఉంది. OnePlus 13లో అలర్ట్ స్లైడర్ ఉంది.

iPhone 16 Plusలో అదనపు బటన్లు అంటే కెమెరా కంట్రోల్, యాక్షన్ బటన్ ఉన్నాయి.

46

OnePlus 13 vs iPhone 16 Plus: కెమెరా

OnePlus 13 ట్రిపుల్ కెమెరా iPhone 16 Plus కంటే మెరుగ్గా ఉంది.

OnePlus 13 50 MP అల్ట్రా-వైడ్ యాంగిల్, టెలిఫోటో లెన్స్‌లతో వస్తుంది.

iPhone 16 Plus డ్యూయల్ కెమెరా కూడా బాగుంది. ముఖ్యంగా వీడియోలకు ఇది బాగా సపోర్ట్ చేస్తుంది.

OnePlus 13 8K వీడియో రికార్డ్ చేయగలదు. కానీ iPhone 16 Plus 4K 60fps వీడియో మెరుగైన రంగులు, క్వాలిటీ అందిస్తుంది.

56

OnePlus 13 vs iPhone 16 Plus: ఆపరేటింగ్ సిస్టమ్

iPhone 16 Plusలో శక్తివంతమైన A18 ప్రాసెసర్‌ ఉంది. iOS 18, Apple Intelligence తో ఇది AAA గేమ్స్‌ను ఆడటానికి సపోర్ట్ చేస్తుంది.

Snapdragon 8 Elite ప్రాసెసర్‌ ఉండటం వల్ల OnePlus 13 కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

iPhone 16 Plus ఐదు OS అప్‌డేట్‌లు, OnePlus 13 నాలుగు OS అప్‌డేట్‌లు పొందుతుంది.

66

OnePlus 13 vs iPhone 16 Plus: బ్యాటరీ

OnePlus 13లో 6,000 mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్ ఉంది. iPhone 16 Plus మంచి సాఫ్ట్‌వేర్ అనుభవం, పనితీరును అందిస్తుంది.

OnePlus 13 vs iPhone 16 Plus: ధర

OnePlus 13 ధర రూ.69,999 నుండి మొదలవుతుంది. iPhone 16 Plus ధర రూ.79,900.

click me!

Recommended Stories