మీకొచ్చే కాల్స్ వేరే నంబర్‌కి ఫార్వడ్ అవుతున్నాయని డౌట్‌గా ఉందా? ఇలా చెక్ చేయండి

Published : Jan 28, 2025, 03:47 PM IST

మీ ఫోన్ కు వచ్చే కాల్స్, మెసేజస్ ఎవరికైనా ఫార్వడ్ అవుతున్నాయేమోనని మీకు అనుమానంగా ఉందా? ఎలా చెక్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం రండి. ఒక వేళ నిజంగా ఫార్వడ్ అవుతుంటే ఎలా ఆపాలో కూడా ఇక్కడ తెలుసుకోండి.   

PREV
15
మీకొచ్చే కాల్స్ వేరే నంబర్‌కి ఫార్వడ్ అవుతున్నాయని డౌట్‌గా ఉందా? ఇలా చెక్ చేయండి

ఎవరైనా మనకు ఫోన్ చేస్తే కాల్ మాట్లాడతాం. కాని ఎవరైనా మనకు ఫోన్ చేసినప్పుడు నెట్వర్క్ లేకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం లాంటివి జరిగినప్పుడు కాల్ ఫార్వడింగ్ జరుగుతుంది. కొన్ని ఫోన్లలో ఈ ఆప్షన్ మీకు తెలియకుండానే యాక్టివేట్ అయి ఉంటుంది. సాధారణంగా ఇది మీ ఫోన్ లో ఉన్న రెండో సిమ్ నంబరకు కాల్ ఫార్వడింగ్ జరుగుతుంది. 
 

25

కాని మీకు తెలియకుండా మీ ఫోన్ లో కాల్ ఫార్వడింగ్ ఆప్షన్ ని ఎవరైనా యాక్టివేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. మీ మొబైల్ రిపేర్ కి ఇచ్చినప్పుడు, లేదా మీకు తెలిసిన వాళ్లే మీ సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఇలాంటి పని చేసే అవకాశం ఉంది. 
 

35

మీరు సెలెబ్రిటీ అయితే మీ శత్రువులు ప్లాన్ చేసి స్కామర్ల ద్వారా మీ ఫోన్ లో కాల్ ఫార్వడింగ్ ఆప్షన్ ని యాక్టివేట్  చేసే ఛాన్స్ కూడా ఉంది. మరి మీకు ఎప్పుడైనా మీకు రావాల్సిన కాల్స్ లేదా వచ్చే కాల్స్ వేరే నంబర్ కి  ఫార్వడ్ అవుతున్నాయని అనుమానం కలిగిందా? ఎలా చెక్ చేయాలో ఇక్కడ చూద్దాం.

45

మీ ఫోన్ తీసుకొని అందులో డయల్ ప్యాడ్ ఓపెన్ చేయండి.
అందులో *#61# డయల్ చేయండి.
ఇలా డయల్ చేయగానే మీ నంబర్ కి వచ్చే కాల్స్ ఎవరికైనా ఫార్వడ్ అవుతుంటే ఆ నంబర్ అక్కడ కనిపిస్తుంది. 
ఒక వేళ కాల్ ఫార్వడింగ్ జరగకపోతే not Forwarded అని కనిపిస్తుంది.
ఒకవేళ మెసేజస్ ఫార్వడ్ అవుతున్నా ఫార్వడ్ అవుతున్న నంబర్ కనిపిస్తుంది. 

55

నిజంగానే మీకు తెలియకుండా మీకొచ్చే ఫోన్ కాల్స్, మెసేజస్ వేరే నంబర్ కి ఫార్వడ్ అవుతుంటే ఎలా ఆపాలో ఇక్కడ చూద్దాం.

మీ ఫోన్ లో డయల్ ప్యాడ్ ఓపెన్ చేయండి.
అందులో ##002# టైప్ చేసి డయల్ చేయండి. 
దీంతో అప్పటి వరకు ఫార్వడ్ అవుతున్న కాల్స్, మెసేజస్ అన్నీ ఆగిపోతాయి. 
 

click me!

Recommended Stories