ఏదైనా యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అది కొన్ని పర్మీషన్స్ అడుగుతుంది. కాంటాక్ట్స్, మెస్సేజస్ యాక్సిస్ చేయడానికి పర్మీషన్ అడుగుతుంది. ఫొటోస్, వీడియోస్ చూడటానికి పర్మీషన్ అడుగుతుంది. వాటన్నింటికీ allow క్లిక్ చేయకపోతే ఆ యాప్ ఇన్‌స్టాల్ కాదు. దీంతో తెలిసో, తెలియకో అన్నింటికీ allow ఆప్షన్ క్లిక్ చేసేస్తాం. ఇక్కడే మన పర్సనల్ డాటా అంతా ఇతరుల చేతికి వెళ్లిపోతోంది.
మొబైల్ కొన్నప్పుడే డీఫాల్ట్‌గా కొన్ని సెట్టింగులు ఆన్ అయి ఉంటాయి. మీరు కొన్న మొబైల్ కంపెనీ ఇలా కొన్ని డీఫాల్ట్‌గా సెట్ చేస్తుంది. అలాంటి చాలా ఆప్షన్స్ మనకి మంచే చేసినా కొన్ని ఆప్షన్స్ మాత్రం మన డాటా మొత్తాన్ని యాక్సిస్ చేసే విధంగా ఆన్ అయి ఉంటాయి.