పైలెట్లు కూడా విమానాలు నడపడానికి భయపడే ప్రాంతం గురించి విన్నారా?

First Published | Sep 9, 2024, 4:46 PM IST

ఆ ప్రాంతంలో విమానాలు నడపడం ఏమీ బ్యాన్‌ చేయలేదు. అయినా అటువైపు విమానాలు వెళ్లవు. పైలెట్లు కూడా ఆ ప్రాంతంలో విమానాలు నడపమంటే భయపడతారు. విచిత్రమైన ఆ ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రండి. 
 

జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని అందరికీ ఉంటుంది. మనకేమో విమానం ఎక్కడం ఒక కోరిక. మరి పైలెట్లకేమో ప్రయాణికులను జాగ్రత్తగా గమ్యస్థానానికి చేర్చడం బాధ్యత. అందుకే పైలెట్లు చాలా అప్రమత్తంగా ఉండి ఎరోప్లేన్‌ నడుపుతారు. అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకొనే పైలెట్లు టిబెట్‌ పీఠభూమి పైనుంచి విమానాలు నడపడానికి భయపడతారు. చైనాకు సరిహద్దుగా, భారతదేశానికి దగ్గరగా ఉన్న టిబెట్ ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రదేశాలలో ఒకటి. టిబెట్ మొత్తం పూర్తిగా పర్వతాలతో నిండి ఉంటుంది. టిబెట్‌ పీఠభూమిని 'ప్రపంచ పైకప్పు' అని కూడా పిలుస్తారు. అందువల్లనే ఏ విమానయాన సంస్థ కూడా టిబెట్ పైనుంచి తమ విమానాలను నడపదు. ఎందుకో కారణాలు తెలుసుకుందాం.
 

* అధిక ఎత్తు
టిబెట్ పీఠభూమి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటి. దీని సగటు ఎత్తు సుమారు 4,500 మీటర్లు అంటే 15,000 అడుగులు అన్నమాట. ఈ ఎత్తులో గాలిలో మలినాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల విమానాలు ఎగరడం కష్టంగా ఉంటుంది. 

* తక్కువ వాయు పీడనం
ఎక్కువ ఎత్తులో వాయు పీడనం తక్కువగా ఉంటుంది. దీని వల్ల విమానాల ఇంజిన్లు సరిగ్గా పని చేయకపోవచ్చు. విమాన ఇంజిన్లు సమర్థవంతంగా పని చేయడానికి గాలి సరైన వాయు పీడనం అవసరం.
 


* చుట్టూ భారీ పర్వతాలు
టిబెట్ పీఠభూమి పరిసరాలలో హిమాలయాలు వంటి భారీ పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాల వద్ద సురక్షితంగా విమానాలను నావిగేట్ చేయడం చాలా క్లిష్టమైన పని. పైగా వాతావరణ మార్పులు ఇక్కడ వేగంగా మారిపోతాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశాలైన మౌంట్ ఎవరెస్ట్, కే2 కూడా ఈ భాగంలోనే ఉన్నాయి. ఈ భాగంలో ఆక్సిజన్ కొరత ఉండటంతో ఏ క్షణంలోనైనా ఇంజిన్ ఫెయిల్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ భాగంలో విమానాలు ఎగరడానికి ఇంజిన్ నడుస్తూ ఉండటానికి ఎక్కువ ఇంధనం అవసరం. దీనివల్ల ఎగరడం మరింత ప్రమాదకరం. 
 

* టేక్ ఆఫ్, ల్యాండింగ్‌ ప్రాబ్లమ్స్‌..
ఎత్తైన పర్వతాలు ఉండటం వల్ల విమానాలు వాటి కంటే ఎక్కువ ఎత్తులో ఎగరాలి. వీటన్నింటితో పాటు, ఇక్కడ ఎప్పుడూ తీవ్రమైన వాతావరణం ఉంటుంది. ఈ సందర్భంలో, విమానాలు పర్వతాలను ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా టిబెట్‌లో చాలా తక్కువ విమానాశ్రయాలు ఉన్నాయి. ఉన్నవి కూడా ఎత్తులో ఉండడం వల్ల విమానాలకు టేక్ ఆఫ్, ల్యాండింగ్ చాలా కష్టంగా ఉంటుంది.
 

* ప్రమాదకర వాతావరణ పరిస్థితులు
టిబెట్‌లో వాతావరణ పరిస్థితులు తరచూ మారిపోతుంటాయి. గాలులు, మంచు తుఫాన్లు, ఉష్ణోగ్రత మార్పులు తరచూ సంభవిస్తుంటాయి. విమానాల రాకపోకలకు ఇలాంటి వాతావరణం చాలా డేంజర్‌. భౌగోళిక సవాళ్లు, తీవ్ర వాతావరణ పరిస్థితులు, భద్రతకు భరోసా లేకపోవడం వల్ల ఈ ప్రాంతాన్ని విమానాలు ఎగరని జోన్‌గా అనధికారికంగానే పేరు వచ్చేసింది. 
 

Latest Videos

click me!