ఈ ట్రైన్ వస్తుంటే వందే భారత్ కూడా దారి ఇవ్వాల్సిందే. ఆ స్పెషల్ ట్రైన్ ఏంటో తెలుసా?

First Published | Nov 14, 2024, 10:38 AM IST

ట్రైన్ వస్తోందంటే అందరూ దారి ఇస్తారు కదా.. కార్లు, బస్సులు, లారీలు ఇలా ఎంత పెద్ద వాహనమైనా ఆగిపోవాల్సిందే. అలాంటి రైళ్లు కూడా ఓ ట్రైన్ వస్తోందంటే దారి ఇచ్చేస్తాయి. గూడ్స్, పాసింజర్, ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఇలా ఏ రైలైనా ఆ ట్రైన్ కి దారి ఇచ్చేయాల్సిందే. అది ఇటీవల హైస్పీడ్ తో పరుగులు పెడుతున్న వందే భారత్ రైలు అని మీరు అనుకుంటున్నారా? మీరు పొరపాటు పడ్డారు. వందే భారత్ రైళ్లు కూడా ఆ ట్రైన్ కి దారి ఇవ్వాల్సిందే. ఆ ట్రైన్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం రండి. 

ఇండియాలోనే అత్యంత ప్రత్యేక రైలు

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఇండియన్ రైల్వే ఒకటి. ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తారు. రైలు ప్రయాణీకులకు ఇండియన్ రైల్వే అనేక రాయితీలు, సౌకర్యాలను కల్పిస్తోంది.

పండగలు, వరుస సెలవుల్లో అనేక ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. దేశంలో రాజధాని, దురంతో, శతాబ్ది వంటి అనేక రకాల రైళ్లు నడుస్తున్నాయి. కానీ భారతదేశంలో అత్యంత ప్రత్యేకమైన రైలు ఏదో మీకు తెలుసా? ఆ ప్రత్యేక రైలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.

VVIP రైలైనా ఈ రైలుకి దారి ఇవ్వాల్సిందే

రాజధాని, దురంతో, స్వర్ణ శతాబ్ది ఈ రైళ్లు అత్యంత వేగంతో నడిచే రైళ్లు. ఇవి కూడా ఈ రైలుకి దారి ఇవ్వాలి. అంటే VVIP రైలైనా ఈ రైలుకి దారి ఇవ్వాల్సిందే. 'వందే భారత్' అని మీరు అనుకుంటే అది కూడా తప్పు. ఈ రైలు వెళ్ళడానికి 'వందే భారత్' కూడా ఆపేస్తారు. అసలు ఈ రైలు పేరు ఏమిటంటే యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ట్రైన్.


యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ట్రైన్

దేశంలో మరే ఇతర రైలుకు దారి ఇవ్వని ఏకైక రైలు యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ట్రైన్ (ప్రమాద సహాయక వైద్య రైలు). ఇది ట్రాక్‌పై నడుస్తున్నప్పుడు ఏ రైలైనా దారి ఇవ్వాలి. భారతదేశంలో ఎక్కడైనా రైలు ప్రమాదం జరిగితే వైద్య సదుపాయాలను వేగంగా అందించడానికి ఈ రైలు పనిచేస్తుంది.

ఈ రైలులో ఆధునిక పరికరాలు, వైద్య సదుపాయాలు ఉన్నాయి. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించేందుకు రైలులో వైద్యులు, పారామెడిక్ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. 

ఇండియాలోనే అత్యంత ప్రత్యేక రైలు

యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ట్రైన్స్ ఎక్కడ ఉంటాయా అని ఆలోచిస్తున్నారా? అవి ఇండియన్ రైల్వేకి చెందిన ముఖ్యమైన యార్డ్‌లు, స్టేషన్లలో ఉంటాయి. రైలు ప్రమాదం జరిగితే రెస్క్యూ, రిలీఫ్ కార్యక్రమాల కోసం ఈ రైలు చాలా తక్కువ సమయంలో ప్రమాద స్థలానికి చేరుకుంటుంది. కాబట్టి ఈ రైలును ప్రమాద స్థలానికి త్వరగా తీసుకురావడానికి ఇతర రైళ్లను ఆపుతారు.

Latest Videos

click me!