Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. నేడు మీ నగరంలో ధరలు ఎంత పెరిగాయో తెలుసుకోండి

Ashok Kumar   | Asianet News
Published : May 26, 2022, 08:46 AM ISTUpdated : May 26, 2022, 08:55 AM IST

నేడు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను చమురు కంపెనీలు విడుదల చేశాయి. అయితే చమురు కంపెనీలు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. గత శనివారం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. దీంతో  పెట్రోల్ ధర గరిష్టంగా రూ.9, డీజిల్ ధర రూ.7 దిగోచ్చింది.

PREV
14
Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. నేడు మీ నగరంలో ధరలు ఎంత పెరిగాయో తెలుసుకోండి

నేడు ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.96.72 , డీజిల్ లీటరుకు రూ.89.62గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.111.35, డీజిల్ ధర లీటరుకు రూ.97.28గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76. చెన్నైలో కూడా లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24గా ఉంది. 
 

24

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా చమురు కంపెనీలు ఇంధన ధరలు పెంచకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డుకుందని ప్రభుత్వ రాజకీయ ప్రత్యర్థులు ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 112 డాలర్లకు చేరుకోవడంతో చమురు కంపెనీలు డీజిల్ బల్క్ కొనుగోలుదారుల కోసం లీటరుకు రూ.25 పెంచాయి. క్రమేణా రిటైల్ ధరలను పెంచుతామని చమురు డీలర్లు తెలిపారు.  
 

34

మీ నగరంలో ఇంధన ధరల కోసం
మీరు SMS ద్వారా కూడా పెట్రోల్-డీజిల్ ధరను తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌కి వెళ్లడం ద్వారా మీరు RSP అండ్  మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది, మీరు దీనిని IOCL వెబ్‌సైట్ నుండి పొందవచ్చు.

44

పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు మారుతాయి. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ ఇతర జోడించిన తర్వాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ పారామితుల ఆధారంగా, చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతు బ్యారెల్ కి  114.5 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక్కరోజులోనే ఇంధన ధరలు 0.56 శాతం పెరిగాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి విలువ క్షీణించింది ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ 77.49 వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 9.83 తగ్గుదలతో లీటరుకు రూ. 109.67, డీజిల్ ధర రూ. 7.67  తగ్గడంతో లీటరుకి రూ. 97.82వద్ద ఉంది.

 

click me!

Recommended Stories