గణాంకాలను పరిశీలిస్తే, గత ఏడాది కాలంలో, CNG ధరలు విపరీతంగా పెరిగాయి. దీని ధర ఏడాదిలో కిలోకు 60 శాతం అంటే రూ. 32.21 పెరిగింది. అంతర్జాతీయంగా న్యాచురల్ గ్యాస్ ధరల కారణంగా భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉందని ఐజీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. జనవరి 2022 నుండి దాదాపు ప్రతి వారం, CNG కిలోకు దాదాపు 50 పైసలు పెరిగింది.