రెండురోజుల లాభాలకు బ్రేక్.. నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

First Published Oct 6, 2021, 5:08 PM IST

నేడు బుధవారం రోజున దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలలో ముగిసింది. దీంతో రెండు రోజుల వరుస లాభాలకు చెక్ పడింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్ సెన్సెక్స్ 555.15 పాయింట్లు (0.93 శాతం) తగ్గి 59,189.73 వద్ద ముగిసింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 176.30 పాయింట్లు (0.99 శాతం) తగ్గి 17,646.00 వద్ద ముగిసింది. 

 ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయంగా బలహీనమైన సంకేతాలు రావడం, ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశాల సందర్భంగా దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. గత వారం బి‌ఎస్‌ఈ 30-షేర్ సెన్సెక్స్ 1,282.89 పాయింట్లు (2.13 శాతం) పడిపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ భారీగా పతనమై రూ.75.02 వద్ద ఆరు నెలల కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. 

గ్లోబల్ స్టాక్ మార్కెట్ల గురించి మాట్లాడితే నేడు యుఎస్ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. డౌ జోన్స్ 0.94 శాతం పెరిగి 34,314 వద్ద ముగిసింది. మరోవైపు, నాస్‌డాక్ 1.25 శాతం పెరిగి 14,433 వద్ద , ఎస్&పి 500 1.05 శాతం పెరిగి 4,345 వద్ద ఉన్నాయి.
 

ఓ‌ఎన్‌జి‌సి, టాటా కన్స్యూమర్, యూ‌పి‌ఎల్, బ్రిటానియా, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ షేర్లు లాభాలతో ముగిశాయి. మరోవైపు, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బిఐ లైఫ్, హిందాల్కో, సిప్లా, టాటా స్టీల్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్ నష్టాలలో ముగిశాయి.  
 

సెక్టోరల్ ఇండెక్స్‌ని పరిశీలిస్తే, 
సెక్టోరల్ ఇండెక్స్‌ని పరిశీలిస్తే నేడు అన్ని రంగాలు రెడ్ మార్క్‌లో ముగిశాయి. వీటిలో మీడియా, ఐ‌టి, ఫైనాన్స్ సేవలు, బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఆటో, మెటల్, ఫార్మా, పి‌ఎస్‌యూ బ్యాంకులు, రియల్టీ, ఎఫ్‌ఎం‌సి‌జి ఉన్నాయి.

  స్టాక్ మార్కెట్ ఉదయం లాభాలతో  ప్రారంభమైంది. సెన్సెక్స్ 88.86 పాయింట్లు (0.15 శాతం) లాభంతో 59,833.74 వద్ద ప్రారంభమైంది. మరోవైపు, నిఫ్టీ 47.20 పాయింట్ల (0.26 శాతం) లాభంతో 17,869.50 వద్ద ప్రారంభమైంది.

నిన్న స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గులు తరువాత లాభాలలో  ముగిసింది. సెన్సెక్స్ 445.56 పాయింట్ల (0.75 శాతం) లాభంతో 59,744.88 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 131.05 పాయింట్ల లాభంతో (0.74 శాతం) 17,822.30 వద్ద ముగిసింది.

click me!