సామాన్యుడికి షాక్.. గ్యాస్ సిలిండర్ల ధర మళ్ళీ పెంపు.. నేటి నుంచి అమల్లోకి..

First Published Oct 6, 2021, 12:01 PM IST

దేశంలో వంట గ్యాస్ ధ‌ర‌లు మ‌ళ్లీ  పెరిగాయి. చమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన ఎల్‌పి‌జి సిలిండర్ల ధరలను సమీక్షిస్తుంటాయి. అయితే దీని పన్ను రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతుంది అలాగే తదనుగుణంగా ఎల్‌పి‌జి ధరలు మారుతూ ఉంటాయి. 

 దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు 14.2 కిలోల ఎల్‌పి‌జి సిలిండర్ల ధరలను నేడు రూ .15 పెంచాయి. మరోవైపు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. పెరిగిన ధరలు నేటి నుంచి అంటే బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి.
 

రెండు నెలల కన్నా తక్కువ వ్యవధిలో గ్యాస్ సిలిండర్ల ధారలలో ఇది నాల్గవ పెరుగుదల. సబ్సిడీ సిలిండర్ ధర గత నెల అంటే సెప్టెంబర్ 1న రూ.25 పెరిగింది. సబ్సిడీ ఎల్‌పిజి ధర జనవరి 1 నుండి తాజా పెంపుతో సిలిండర్‌పై రూ. 205 పెరిగింది. ఈ నెలలో 19కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.43 పెరగడం సామాన్యులకు పెను భారంగా మారింది.
 

దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ లేని ఎల్‌పి‌జి సిలిండర్ ధర రూ. 884.5 నుండి రూ. 899.50 కి పెరిగింది. పాట్నాలో ఇప్పుడు మీరు ఎల్‌పి‌జి సిలిండర్ కోసం రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. చెన్నైలో 14.2 కిలోల ఎల్‌పి‌జి సిలిండర్ రూ. 915.50 కి చేరింది. ఇక 5 కేజీల సిలిండ‌ర్ ఇప్పుడు రూ.502కు ల‌భిస్తుంది. మెట్రో నగరాల్లో అత్యధికంగా ఎల్‌పిజి సిలిండర్ కోల్‌కతాలో రూ. 926 కి లభిస్తోంది. చెన్నైలో 14.5 కిలోల వంట గ్యాస్ ధర రూ .915.50. ఇక హైదరాబాద్లో ఇండియన్ గ్యాస్ ధర రూ.937 నుంచి రూ.952కి పెరిగింది.
 

అక్టోబర్ 1న 19 కిలోల వాణిజ్య ధరలు 
కొద్దిరోజుల  క్రితం అక్టోబర్ 1న ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.1693 నుండి రూ.1736.50కు పెరిగింది. దీని ధర కోల్‌కతాలో రూ .1805.5, ముంబైలో రూ .1685, చెన్నైలో రూ. 1867.5గా ఉంది. సెప్టెంబరులో దీని ధర రూ .75 పెరిగిన  సంగతి మీకు తెలిసింది.
 

గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వం సబ్సిడీ 
ప్రస్తుతం ప్రభుత్వం అర్హతగల వినియోగదారులకు సంవత్సరానికి 14.2 కిలోల 12 సిలిండర్లపై సబ్సిడీని అందిస్తుంది. కస్టమర్లకు 12 కంటే ఎక్కువ సిలిండర్లు కావాలంటే, వాటిని మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా సమీక్షిస్తుంటారు. సగటు అంతర్జాతీయ బెంచ్ మార్క్, విదేశీ మారకపు ధరల్లో మార్పులు వంటి అంశాల ద్వారా దీని ధర నిర్ణయించబడుతుంది.

ఎల్‌పి‌జి సిలిండర్‌ని ఎలా బుక్ చేయాలి
 ఎల్‌పి‌జి సిలిండర్ బుక్ చేయడానికి 8454955555 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి. అంతే మీరు వాట్సాప్ ద్వారా కూడా సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. రీఫిల్ అని టైప్ చేసి  మీరు 7588888824 నంబర్‌కు మెసేజ్ చేయవచ్చు దీంతో సిలిండర్ బుక్ అవుతుంది. గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా 1వ తేదీన మారుతుంది. 


గ్యాస్ ధరలను పెంచడానికి రెండు కారణాలను భావిస్తున్నారు ఒకటి ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం మరొకటి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా గ్యాస్ ధరలు పెరుగుతున్నట్టు చెబుతున్నారు.

click me!