నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్.. నేడు లాభాలతో మిగిసిన స్టాక్‌ మార్కెట్‌..

Ashok Kumar   | Asianet News
Published : Oct 04, 2021, 05:15 PM IST

నేడు ఈ వారంలోని మొదటి ట్రేడింగ్ రోజున సోమవారం స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గుల తర్వాత లాభాలలో ముగిసింది. ఒక విధంగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తిరిగి పుంజుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 533.74 పాయింట్ల లాభంతో (0.91 శాతం) 59,299.32 వద్ద ముగిసింది. 

PREV
13
నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్.. నేడు లాభాలతో మిగిసిన స్టాక్‌ మార్కెట్‌..

మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 159.20 పాయింట్ల లాభంతో (0.91 శాతం) 17,691.25 వద్ద ముగిసింది. గత నాలుగు రోజుల వరుస నష్టాల నుంచి కోలుకుని భారీగా దూసుకెళ్లాయి.  గత వారం బి‌ఎస్‌ఈ 30-షేర్ సెన్సెక్స్ 1,282.89 పాయింట్లు అంటే 2.13 శాతం పడిపోయింది.  స్టాక్ మార్కెట్ వరుసగా నాల్గవ ట్రేడింగ్ రోజున శుక్రవారం కూడా క్షీణించింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 74.32గా ఉంది. మరోవైపు సుమారు 2227 షేర్లు అడ్వాన్స్ అయితే, 961 షేర్లు క్షీణించాయి, 172 షేర్లు మారలేదు.
 

23

డివిస్ ల్యాబ్, హిందాల్కో, ఎన్‌టిపిసి, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా మోటార్స్ లాభాలలో ముగిశాయి. మరోవైపు సిప్లా, గ్రాసిమ్, యుపిఎల్, ఐఒసి, బజాజ్ ఆటో షేర్లు రెడ్ మార్క్‌లో ముగిశాయి.

సెక్టోరల్ ఇండెక్స్‌ని పరిశీలిస్తే నేడు అన్ని సెక్టార్లు గ్రీన్ మార్క్‌లో ముగిశాయి. వీటిలో మీడియా, మెటల్, ఫార్మా, పి‌ఎస్‌యూ బ్యాంకులు, రియల్టీ, ఐ‌టి, ఎఫ్‌ఎం‌సి‌జి, ఫైనాన్స్ సేవలు, బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఆటో ఉన్నాయి. 

ఈ వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్ల నిర్ణయం, గ్రాస్ ఫైనాన్షియల్ డేటా, ప్రపంచ ధోరణి స్టాక్ మార్కెట్ దిశని నిర్ణయిస్తుందని భావిస్తున్నారు.  
 

33

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నేడు ఉదయం లాభాలతో  ప్రారంభించింది. సెన్సెక్స్ 294.90 పాయింట్లు (0.50 శాతం) లాభంతో 59060.48 వద్ద ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ 83.80 పాయింట్ల (0.48 శాతం) లాభంతో 17615.80 వద్ద ప్రారంభమైంది.

  గత వారం చివరి ట్రేడింగ్ రోజూన 
గత వారం చివరిలో  స్టాక్ మార్కెట్  అస్థిరతల తరువాత చివరికి నష్టాలలో ముగిసింది. సెన్సెక్స్ 360.78 పాయింట్లు (0.61 శాతం) తగ్గి 58,765.58 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 86.10 పాయింట్లు (0.49 శాతం) తగ్గి 17,532.05 వద్ద ముగిసింది. 

click me!

Recommended Stories