MG Cyberster: 3.2 సెకన్లలో 100 కి.మీ వేగం.. 580 కి.మీ. రేంజ్.. ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ధరెంతంటే?

Published : Jul 26, 2025, 12:22 PM IST

MG Cyberster:  ఈవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంజి సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు భారత్ లో లాంచ్ అయ్యింది. లాంచ్ తో పాటే ప్రారంభ ఆఫర్ కూడా ప్రకటించారు. ఈ కారు ప్రత్యేకతలు, ఆ ప్రారంభ ఆఫర్ వివరాలు ఏంటో ఓ లూక్కేయండి.

PREV
16
ఎంజి సైబర్‌స్టర్ భారత మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ

ఈవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంజి సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు భారత్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.  ఆకర్షణీయమైన డిజైన్, 580 కిలోమీటర్ల రేంజ్ వంటి ప్రత్యేకతలతో ఈ కారు ఎలక్ట్రిక్ మార్కెట్లో కొత్త ట్రెండ్ సెట్ చేయనుంది.

భారీ ప్రారంభ డిస్కౌంట్‌: వీధుల్లో వేగంగా దూసుకెళ్లే ఈ కారును ముందస్తు బుకింగ్ చేసుకునే వినియోగదారులకు రూ. 2.5 లక్షల డిస్కౌంట్ అనే స్పెషల్ ఆఫర్‌ ప్రకటించింది ఎంజి మోటార్స్. ఇది కంపెనీ నుంచి భారత వినియోగదారులకు ఓ బంపర్ బెనిఫిట్‌ అని చెప్పొచ్చు.  కొత్త ఎలక్ట్రిక్ కారుతో ఎంజి భారత EV మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేయబోతోంది. 

26
ఎంజి సైబర్‌స్టర్ ధర వివరాలు

ఎంజి మోటార్స్ తాజాగా భారత మార్కెట్లో లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు సైబర్‌స్టర్ ప్రారంభ ధరను ₹74.99 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధర ప్రస్తుతం బుకింగ్ చేసుకునే వినియోగదారులకు వర్తిస్తుంది. అయితే, ఇప్పటికే కారును ముందుగా బుకింగ్ చేసుకున్న వారికి కంపెనీ రూ. 2.5 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. అందువల్ల వారు ఈ కారు కొనుగోలును కేవలం ₹72.49 లక్షలకే లభిస్తుంది. 

36
సూపర్ పవర్‌తో దూసుకొచ్చిన ఎంజి సైబర్‌స్టర్!

 ఎంజి సైబర్‌స్టర్ కారులో అత్యాధునిక డ్యూయల్ మోటార్ సిస్టమ్ ఉపయోగించారు, ఈ ఫీచర్ వల్ల సూపర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుగా నిలబెడుతోంది. ఇందులోిన మోటార్లు కలిపి 510 PS పవర్,  725 Nm టార్క్ ఉత్పత్తి చేస్తాయి, దీని వలన కేవలం 3.2 సెకన్లలో 0–100 కేఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది.  

ప్రత్యేకత ఏంటంటే MG Cyberster లో 77 kWh బ్యాటరీ ప్యాక్ వాడారు. ఈ బ్యాటరీ చాలా సన్నగా ఉన్నా అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంంది. ఇది కారుకు తక్కువ బరువు, మెరుగైన రేంజ్, వేగాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. 

46
సింగిల్ ఛార్జ్‌తో 580KM రేంజ్

ఎంజి సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 580 కిలోమీటర్ల మైలేజ్ రేంజ్ ఇస్తుంది. ఇది లాంగ్ డ్రైవ్‌లకైనా, నగర ప్రయాణాలకైనా పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. స్పీడ్ లవర్స్ కు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కారు కేవలం 3.2 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. అంతేకాకుండా, గరిష్ట వేగం 200 kmph ఉండడం దీన్ని నిజమైన హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుగా నిలబెడుతోంది. 

56
ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ

ఎంజి సైబర్‌స్టర్ కారులో 144 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తారు. దీని సహాయంతో కేవలం 40 నిమిషాల్లో 10% నుంచి 80% వరకు బ్యాటరీని ఛార్జ్ చేయడం సాధ్యమవుతుంది. వేగంగా ఛార్జ్ కావడం వలన దీన్ని డైలీ డ్రైవింగ్‌కు, ట్రావెల్‌కు మరింత అనువుగా మారుస్తుంది.

కారును కొనుగోలు చేసే వినియోగదారులకు కంపెనీ అదనంగా 3.3 kW పోర్టబుల్ ఛార్జర్,  7.4 kW వాల్ బాక్స్ ఛార్జర్ కూడా అందిస్తోంది. వీటితో ఇంట్లోనూ, ఆఫీస్ వద్దనూ సౌకర్యవంతంగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.  

66
భారత తొలి ఎలక్ట్రిక్ సూపర్‌కార్

ఎంజి సైబర్‌స్టర్ ఒక హై పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు మాత్రమే కాదు, ఇది భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ సూపర్‌కారు గా ప్రత్యేక గుర్తింపు పొందింది. అద్భుతమైన డిజైన్, అద్భుతమైన వేగం, అధునాతన ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో కొత్త మైలురాయిగా నిలుస్తోంది. ఈ కారు సాధారణ ఎంజి మోటార్స్ డీలర్‌షిప్‌లలో లభించదు. ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన ఎంజి ప్రీమియం డీలర్‌షిప్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.  

Read more Photos on
click me!

Recommended Stories