అంటే, ఈ అకౌంట్ ద్వారా ఖాతాదారులు కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేకుండా అన్ని బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు.
కస్టమర్లు ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డ్‌ని కూడా పొందవచ్చు. ఖాతాలో నామమాత్రపు క్వాటర్లీ ఆవరేజ్ బ్యాలెన్స్ (QAB)ని నిర్వహిస్తే సరిపోతుంది. అర్హత కలిగిన ఖాతాదారులు జీవితాంతం ఉచిత డెబిట్ కార్డ్‌ను కూడా పొందుతారు.
BoB లైట్ సేవింగ్స్ అకౌంట్ ఫీచర్స్
1. లైఫ్ టైం జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్.
2. మైనర్‌లతో సహా (10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) ఎవరైనా అకౌంట్ తెరవవచ్చు.
3. మీకు ఈ క్రింది నామమాత్రపు క్వాటర్లీ ఆవరేజ్ బ్యాలెన్స్ (QAB) ఉంటే లైఫ్ టైం రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ ఫ్రీ.
● మెట్రో/అర్బన్ బ్రాంచ్ కోసం: రూ.3,000
● సెమీ-అర్బన్ బ్రాంచ్ కోసం: రూ.2,000
● రూరల్ బ్రాంచ్ కోసం: రూ.1,000
4. బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్‌లు, డిస్కౌంట్స్ పొందవచ్చు.
పండుగ సీజన్ ఆఫర్లు
పండుగ క్యాంపైన్ కింద బ్యాంక్ ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ట్రావెల్, ఫుడ్, ఫ్యాషన్, ఎంటర్‌టైన్‌మెంట్, లైఫ్‌స్టైల్, గ్రోసరీస్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ వంటి ప్రముఖ కన్స్యూమర్ బ్రాండ్‌లతో టై అప్ అయింది.
అందువల్ల బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ హోల్డర్లు వివిధ బ్రాండ్‌ల నుండి ప్రత్యేక ఆఫర్‌లు, తగ్గింపులను పొందవచ్చు.