EV Bike: ఇండియాలోకి వచ్చిన కొత్త సూపర్ EV బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 260 కి.మీ వెళ్లొచ్చు

Published : Jul 30, 2026, 11:21 AM IST

EV Bike: మనదేశంలో కొత్త ఈవీ బైక్ వచ్చేసింది.  గుజరాత్‌కు చెందిన 'అవోర్' స్టార్టప్, 'అవోర్ ఈఎక్స్' సిరీస్‌లో మూడు కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను ఇండియాలో లాంచ్ చేసింది. ఇవి 260 కి.మీ. వరకు దూసుకెళ్తుంది.

PREV
13
మార్కెట్‌లోకి సూపర్ ఈవీ బైక్

ఇప్పుడు ఎలక్ట్రిక్ బైకులకు బాగా ఆదరణ పెరిగింది.  ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ (EV) మార్కెట్‌లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఎంట్రీ ఇచ్చేసింది. గుజరాత్‌కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ 'అవోర్' (Avore), తన 'అవోర్ ఈఎక్స్' (Avore EX) సిరీస్ బైక్‌లను లాంచ్ చేసింది. ఈ కంపెనీ ఈ సిరీస్‌లో 'ఈఎక్స్ 1', 'ఈఎక్స్ 2', 'ఈఎక్స్ 2ఎస్' అనే మూడు వేరియంట్లను తీసుకొచ్చింది. 

కస్టమర్ల బడ్జెట్‌కు తగ్గట్టుగా కంపెనీ ఈవీ బైక్‌ ధరలను నిర్ణయించింది. ప్రారంభ వేరియంట్ అవోర్ ఈఎక్స్ 1 ఎక్స్-షోరూమ్ ధర రూ.1.23 లక్షలుగా నిర్ణయించింది. మధ్యస్థ మోడల్ ఈఎక్స్ 2 ధర రూ.1.46 లక్షలుగా ఉంది. ఇక టాప్-ఎండ్ మోడల్ ఈఎక్స్ 2ఎస్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.1.70 లక్షలుగా ఫిక్స్ చేశారు. ఈ బైక్‌ను కొనాలనుకునే వారు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కేవలం రూ.799 చెల్లించి ప్రీ-బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

23
బ్యాటరీ కెపాసిటీ అదిరిపోతుంది

అవోర్ ఈఎక్స్ సిరీస్‌లోని మూడు మోడళ్లు మంచి బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంటాయి. ఇవి వేగంగా కూడ వెళతాయి.  బేస్ మోడల్ ఈఎక్స్ 1లో 3.24 kWh బ్యాటరీ ఉంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 160 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. గంటకు 100 కి.మీ. గరిష్ట వేగంతో వెళ్తుంది. మిడ్-రేంజ్ మోడల్ ఈఎక్స్ 2లో 5 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 255 కి.మీ. రేంజ్ అందిస్తుంది. ఇక టాప్-ఎండ్ వేరియంట్ ఈఎక్స్ 2ఎస్‌లో కూడా 5 kWh బ్యాటరీనే ఉపయోగించారు. ఇది ఫుల్ ఛార్జ్‌పై ఏకంగా 260 కి.మీ. రేంజ్, గంటకు 114 కి.మీ. గరిష్ట వేగాన్ని అందిస్తుంది.

33
బ్యాటరీ ఛార్జ్ సులువు

ఈ కొత్త ఈవీ  బైక్ బ్యాటరీని ఛార్జ్ చేయడం చాలా సులువు. ఇంట్లోని సాధారణ 15A సాకెట్‌తో కేవలం 2 గంటల్లోనే 20% నుంచి 80% వరకు వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. టెక్నాలజీ పరంగా కూడా ఈ బైక్ అడ్వాన్స్‌డ్‌గా ఉంది. ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 5 రైడింగ్ మోడ్‌లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, మెరుగైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో ఇప్పటికే ఉన్న అథర్, రివోల్ట్, ఓలా కంపెనీల ఎలక్ట్రిక్ బైక్‌లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

Read more Photos on
click me!

Recommended Stories