కొత్త మహీంద్రా బొలెరో ఇంత మైలేజ్ ఇస్తుందా? రాయల్ లుక్ అదిరిపోయింది

First Published | Nov 13, 2024, 5:03 PM IST

కారుల్లో మహీంద్రా కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా బొలెరో మోడల్ కు మార్కెట్ లో డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు బొలెరో అప్ డేట్ అయి కొత్త కలర్ లో, కొత్త ఫీచర్స్ తో మళ్లీ మార్కెట్ లో సందడి చేస్తోంది. ఈ కొత్త మోడల్ బొలెరో మైలేజ్ తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. మహీంద్రా బొలెరో కొత్త ఫీచర్స్ తెలుసుకుందాం రండి. 

మార్కెట్లో సాంప్రదాయక కార్లకు ప్రత్యేకమైన కస్టమర్లు ఉంటారు. వాటి అప్ డేట్ కోసం మరికొంత మంది ఎదురు చూస్తుంటారు. అదే విధంగా కొత్త వాహనాలకు కూడా డిమాండ్ ఉంటుంది. కొత్త వాహనాల కోసం ఎదురుచూస్తున్న కార్ ప్రియుల ఆలోచనలను నెరవేర్చేలా మహీంద్రా కంపెనీ తన సాంప్రదాయ బ్రాండ్ బొలెరో కారును తిరిగి డిజైన్ చేసి అప్‌డేట్ చేసిన ఎడిషన్‌గా రూపొందించింది. ఇందులో కొత్త ఫీచర్లతో high power ఇంజిన్ ఇందులో అమర్చారు. ఇది కారు ప్రియులకు చాలా నచ్చుతుంది. 

మహీంద్రా కంపెనీ దాని ఆఫ్ రోడింగ్ సామర్థ్యాలను మెరుగుపరిచేలా 1.5 లీటర్ ఇంజిన్ ఆప్షన్‌తో కొత్త మహీంద్రా బొలెరో కారును ప్రవేశపెట్టింది. ఈ శక్తివంతమైన ఇంజిన్ 98.56 బిహెచ్‌పి పవర్ తో, 260 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేయడానికి సహాయపడుతుంది. దాని మైలేజ్ విషయానికొస్తే ఇది లీటరుకు గరిష్టంగా 26 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుందని తాజా అప్‌డేట్‌లు సూచిస్తున్నాయి.

Latest Videos


మహీంద్రా కంపెనీ కొత్త బొలెరో కారు లగ్జరీ ఇంటీరియర్ ను కలిగి ఉంది. అధునాతన సాంకేతికతలతో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణ. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఎత్తు సర్దుబాటు చేయడానికి వీలున్న డ్రైవర్ సీటు, కీలెస్ ఎంట్రీ వంటి ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే భద్రతా ఫీచర్ల కోసం మహీంద్రా కంపెనీ దాని ప్రసిద్ధ కొత్త మహీంద్రా బొలెరోలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు అందిస్తోంది. రివర్స్ అసిస్ట్‌తో రియర్ సెన్సార్  పార్కింగ్ సమయంలో ఇబ్బంది లేకుండా చూస్తుంది. ISOFIX చైల్డ్ మౌంట్ వంటి అధునాతన భద్రత ఫీచర్ వల్ల పిల్లలకు ఈ కారు ఎంత రక్షణ కల్పిస్తుందో అర్థం చేసుకోవచ్చు. 

కొత్త మహీంద్రా బొలెరో ధరను పరిశీలిస్తే ఇది రూ.9.95 లక్షల నుండి మార్కెట్లోకి వచ్చింది. దీని హై ఎండ్ వెర్షన్ రూ.13 లక్షల వరకు ఉంటుంది. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లతో, రాయల్ లుక్ కలిగిన కొత్త మహీంద్రా బొలెరోకు 2024లోనే కస్టమర్లను ఆకర్షిస్తుందని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు. తాజా అప్‌డేట్‌లు, కొత్త మహీంద్రా బొలెరో అమ్మకాల పరంగా మార్కెట్ లో ఈ కారుకు మంచి డిమాండ్ ఏర్పడిందని అర్థమవుతోంది. 

click me!