నెట్‌ఫ్లిక్స్‌లో మీకు నచ్చిన, మీరు మెచ్చిన సినిమాలు, వీడియోలే ఎలా వస్తున్నాయో తెలుసా?

Published : Mar 14, 2025, 12:42 PM IST

Netflix AI: నెట్‌ఫ్లిక్స్ ఓ మామూలు స్ట్రీమింగ్ వేదిక కాదు. ఇది ఒక డిజిటల్ సైకాలజిస్ట్. మీ మనసులో దాగున్న కోరికల్ని కరెక్ట్‌గా అంచనా వేసి, మీకు నచ్చిన షోలు, సినిమాలు మీ స్క్రీన్‌పై చూపిస్తుంది. ఇదెలా సాధ్యమో ఇక్కడ క్లియర్ గా తెలుసుకుందాం.   

PREV
15
నెట్‌ఫ్లిక్స్‌లో మీకు నచ్చిన, మీరు మెచ్చిన  సినిమాలు, వీడియోలే ఎలా వస్తున్నాయో తెలుసా?

నెట్‌ఫ్లిక్స్ కి ప్రపంచవ్యాప్తంగా 282 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇందులో ఉండే నెట్‌ఫ్లిక్స్ AI.. సబ్‌స్క్రైబర్లు సెర్చ్ చేస్తున్న ట్రిలియన్ల కొద్దీ డేటాను పరిశీలించి మీ డిజిటల్ చరిత్రను తయారు చేస్తుంది. మీరు కూడా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్ అయి ఉంటే మీరు నెట్‌ఫ్లిక్స్ చూసే టైమ్, వెతికే పదాలు, ఇచ్చే రేటింగ్ అన్నీ కలెక్ట్ చేసి మీ టేస్ట్ మ్యాప్‌ను క్రియేట్ చేస్తుంది.

25

మీ నుంచి కలెక్ట్ చేసిన డేటాతో పాటు కొలాబరేటివ్ ఫిల్టరింగ్, కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్ లాంటి అడ్వాన్స్‌డ్ అల్గారిథమ్స్‌ను ఉపయోగించి మీలాంటి టేస్ట్ ఉన్నవాళ్ల ఇష్టాల్ని, షోల క్వాలిటీస్‌ని స్టడీ చేసి మీ మనసు దోచే సిఫారసులు చేస్తుంది.

మీరు ఒక సీన్ స్కిప్ చేసినా, ఒక ప్రోగ్రాం పూర్తిగా చూసినా, మీ ప్రతి యాక్షన్ ని AI స్టోర్ చేసుకుంటుంది. వాటన్నింటి నుంచి కంటిన్యూగా కొత్త విషయాలు నేర్చుకుంటూ, మీ టేస్ట్ కి తగ్గ సినిమాలు, వీడియోలు, వెబ్ సిరీస్ ను చూడమని మీకు రిఫర్ చేస్తుంది. 

35

మీ కళ్ళను ఎలా ఆకర్షిస్తుంది

నెట్‌ఫ్లిక్స్ జస్ట్ ప్రోగ్రామ్ కాదు. చిన్న బొమ్మల్లో కూడా AI మాయ ఉంటుంది. మీరు ఒక లవ్ స్టోరీ కోసం చూస్తుంటే మీకు రొమాంటిక్ బొమ్మలు చూపించి మీ కళ్ళను ఆకర్షిస్తుంది. మీరు యాక్షన్ ఇష్టపడితే యాక్షన్ సీన్స్ చూపిస్తుంది. మీ మూడ్‌కు తగ్గ బొమ్మలు చూపి మీ కళ్ళను ఆకర్షించి వాటిని క్లిక్ చేసేలా చేస్తుంది.

ప్రిడిక్టివ్ అనాలిసిస్ ద్వారా మీరు తర్వాత ఏం చూడాలనుకుంటున్నారో AI అంచనా వేసి మీ సెర్చింగ్ టైమ్ ను తగ్గిస్తుంది. ఇది మీ డిజిటల్ ఫ్రెండ్‌లా, మీ ఇష్టాల్ని తెలుసుకుని, మీకు నచ్చినవి మాత్రమే చూపిస్తుంది.

45

AI సక్సెస్ సీక్రెట్ ఇదే..

నెట్‌ఫ్లిక్స్ సక్సెస్‌లో AI పాత్ర చాలా గొప్పది. 75% మంది వ్యూయర్స్ AI సిఫారసు చేసిన ప్రోగ్రామ్స్‌నే చూస్తారు. మీరు మీకు నచ్చినవి వెతకడంలో టైమ్ వేస్ట్ చేయకుండా మీకు నచ్చిన ప్రోగ్రామ్స్‌ను చూసి ఎంజాయ్ చేయొచ్చు. యూజర్ ఇష్టాల్ని స్టడీ చేసి, ఏ ప్రోగ్రామ్స్ తీయాలి, ఏ సినిమాలు కొనాలి అని AI డిసైడ్ చేస్తుంది. ఇది డేటా ఆధారిత అప్రోచ్, మీ టేస్ట్‌కు తగ్గ కంటెంట్‌ను క్రియేట్ చేస్తుంది.

55

స్ట్రీమింగ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది

స్ట్రీమింగ్ ప్రపంచంలో పోటీ పెరిగేకొద్దీ నెట్‌ఫ్లిక్స్ దాని AI టెక్నాలజీని ఇంప్రూవ్ చేస్తోంది. మీ మూడ్, రియల్ టైమ్ చూసే అలవాటు, ఇంటరాక్టివ్ స్టోరీ టెల్లింగ్ ఆధారంగా AI క్రియేట్ చేసిన సిఫారసులు రావచ్చు. ఫ్యూచర్‌లో AI మీ డిజిటల్ డ్రీమ్స్‌ను నిజం చేస్తుంది. AI టెక్నాలజీ పెరిగేకొద్దీ నెట్‌ఫ్లిక్స్ మీ డిజిటల్ కోరికల్ని నెరవేరుస్తుంది. 

click me!

Recommended Stories