బ్యాంక్ కస్టమర్లు ఆర్‌బిఐ హెచ్చరిక.. ఆ రోజున మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం అందుబాటులో ఉండదు..

First Published May 18, 2021, 12:45 PM IST

భారతదేశంలో డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందుకు డిజిటల్ లావాదేవీలు చేసేవారికి ఆర్‌బి‌ఐ నోటిఫికేషన్లను కూడా  విడుదల చేస్తుంది. 

అయితే టెక్నికల్ అప్‌గ్రేడ్ కారణంగా మే 23న కొన్ని గంటలు పాటు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (ఎన్‌ఈ‌ఎఫ్‌టి ) సౌకర్యం వినియోగదారులకు అందుబాటులో ఉండదని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఈ అప్‌గ్రేడ్ మే 22న బ్యాంకులు ముగిసిన తర్వాత జరుగుతుంది.
undefined
ఈ కారణంగా మే 22 నుండి మే 23న మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు. ఎన్‌ఈ‌ఎఫ్‌టి సర్వీస్ పనితీరు, రెగ్యులేషన్ మెరుగుపరచడానికి ఈ అప్‌గ్రేడ్ జరుగుతోంది. కాబట్టి మీరు ఎన్‌ఈ‌ఎఫ్‌టి ద్వారా డబ్బు లావాదేవీలు చేయవలసి వస్తే ముందుగానే చేసుకోండీ.
undefined
ఎన్‌ఈ‌ఎఫ్‌టి సౌకర్యం ఉచితం6 జూన్ 2019 ఆర్‌బి‌ఐ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‌టిజిఎస్) ఇంకా ఎన్‌ఈ‌ఎఫ్‌టిని ఉచితంగా చేసింది, ఇది సాధారణ ప్రజలకు పెద్ద బహుమతి. దేశవ్యాప్తంగా డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడానికి ఆర్‌బిఐ ఈ చర్య తీసుకుంది.
undefined
ఈ సౌకర్యం అన్ని బ్యాంకుల్లో 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంతకుముందు ఎన్‌ఈ‌ఎఫ్‌టి సౌకర్యం ఉదయం 8 నుండి రాత్రి 7 గంటల వరకు ఉండేది. ప్రతి నెల మొదటి, మూడవ శనివారాలలో ఎన్‌ఈ‌ఎఫ్‌టి సౌకర్యం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉండేది.
undefined
ఎన్‌ఈ‌ఎఫ్‌టి అంటే ఏమిటి?ఎన్‌ఈ‌ఎఫ్‌టి అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. ఇంటర్నెట్ ద్వారా 2 లక్షల రూపాయల వరకు లావాదేవీలకు ఎన్‌ఈ‌ఎఫ్‌టి ఉపయోగపడుతుంది. దీని ద్వారా డబ్బును ఏదైనా శాఖ బ్యాంకు ఖాతా నుండి ఇతర ఏ శాఖ బ్యాంకు ఖాతాకైనా పంపవచ్చు.
undefined
అయితే దీనిలో ఏకైక షరతు ఏమిటంటే డబ్బ పంపినవారు, డబ్బు స్వీకరించేవారు ఇద్దరూ తప్పనిసరిగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను కలిగి ఉండాలి. రెండు ఖాతాలు ఒకే బ్యాంకుకు చెందినవి అయితే సాధారణ పరిస్థితిలో కొన్ని సెకన్లలోనే డబ్బు బదిలీ చేయవచ్చు.
undefined
click me!