Mutual Funds: లాంగ్ టర్మ్ ఆర్థిక లక్ష్యాల కోసం ప్లాన్ చేసుకునే వారికి, వేగంగా సంపదను సృష్టించుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్. రూ. 5 లక్షలు సరైన మ్యూచువల్ ఫండ్స్‌లో దాచి కాంపౌండింగ్ పవర్‌కు వదిలేస్తే అది రూ. 80 లక్షలకు పైగా కార్పస్‌గా మారుతుంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో లంప్‌సమ్ మ్యాజిక్.. ఈ ఒక్క ప్లాన్‌తో రూ.80 లక్షలు మీ చేతుల్లో!
ఈ రోజుల్లో ప్రైవేట్ ఉద్యోగుల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి ముందుగానే ఆలోచిస్తున్నారు. ఎక్కువ మొత్తం లబ్ధి పొందేందుకు అందరికీ ముందుగా గుర్తొచ్చేది మ్యూచువల్ ఫండ్స్. చాలామంది మ్యూచువల్ ఫండ్స్ అనగానే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా నెలకు కొంతమొత్తం మాత్రమే ఇన్వెస్ట్ చేయగలమని భావిస్తారు. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో లంప్‌సమ్ అంటే ఒకేసారి పెద్ద మొత్తాన్ని కూడా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంది.
మీరు ఒకేసారి రూ. 5 లక్షల మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో లంప్‌సమ్ విధానంలో 10, 15 లేదా 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే ఆ సొమ్ము ఎంతగా పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
25
10 ఏళ్ల పెట్టుబడికి ఎంత రిటర్న్ వస్తుంది?
మీరు రూ. 5 లక్షలను మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకేసారి లంప్‌సమ్ రూపంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు, 10 ఏళ్ల కాలపరిమితిలో మీ సొమ్ము మంచి వృద్ధిని నమోదు చేస్తుంది.
• 10% రిటర్న్: ప్రతి ఏటా 10% రిటర్న్ వస్తే, 10 ఏళ్ల తర్వాత మీ పెట్టుబడి విలువ సుమారు రూ. 12.97 లక్షలు అవుతుంది.
• 12% రిటర్న్: ఒకవేళ రిటర్న్ 12% ఉంటే, మీ కార్పస్ సుమారు రూ. 15.53 లక్షలకు చేరుకుంటుంది.
• 15% రిటర్న్: వార్షిక రిటర్న్ 15% వరకు ఉంటే మాత్రం 10 ఏళ్లలో మీ సొమ్ము సుమారు రూ. 20.23 లక్షలుగా మారుతుంది.
35
15 ఏళ్ల వ్యవధిలో మారుతున్న లెక్కలు
మీ పెట్టుబడి కాలపరిమితిని 15 ఏళ్లకు పెంచితే కాంపౌండింగ్ ప్రభావంతో మీ రిటర్న్స్ పూర్తిగా మారిపోతాయి. కాలిక్యులేషన్ ప్రకారం మీ డబ్బు ఏ విధంగా పెరుగుతుందో ఇక్కడ చూడవచ్చు..
• 10% రిటర్న్: 10% రేటుతో 15 ఏళ్లలో రూ. 5 లక్షల పెట్టుబడి విలువ సుమారు రూ. 20.89 లక్షలు అవుతుంది.
• 12% రిటర్న్: 12% రిటర్న్ లభిస్తే ఈ మొత్తం సుమారు రూ. 27.37 లక్షలకు పెరుగుతుంది.
• 15% రిటర్న్: అదే 15% రిటర్న్ వస్తే ఈ సొమ్ము ఏకంగా సుమారు రూ. 40.69 లక్షలకు చేరుకుంటుంది.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 10%, 15% రిటర్న్స్ మధ్య వ్యత్యాసం సుమారు రూ. 19.80 లక్షలుగా ఉంది. అంటే రిటర్న్స్‌లో కేవలం 5% తేడా ఉన్నా, దీర్ఘకాలంలో అది ఎంత పెద్ద వ్యత్యాసాన్ని చూపుతుందో స్పష్టంగా అర్థమవుతోంది.
మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను 20 ఏళ్ల పాటు అలాగే కొనసాగిస్తే కాంపౌండింగ్ అసలు పవర్ బయటపడుతుంది. సుదీర్ఘ కాలపరిమితి వల్ల మీ రూ. 5 లక్షల లంప్‌సమ్ పెట్టుబడి ఊహించని స్థాయిలో వృద్ధి చెందుతుంది..
• 10% రిటర్న్: 20 ఏళ్ల పాటు 10% రిటర్న్ వస్తే రూ. 5 లక్షలు సుమారు రూ. 33.64 లక్షలు అవుతాయి.
• 12% రిటర్న్: 12% అంచనాతో చూస్తే ఈ మొత్తం సుమారు రూ. 48.43 లక్షలకు చేరుతుంది.
• 15% రిటర్న్: ఒకవేళ మీ ఫండ్ 15% వార్షిక రిటర్న్ ఇస్తే గనుక, మీ రూ. 5 లక్షల ఇన్వెస్ట్‌మెంట్ ఏకంగా సుమారు రూ. 81.83 లక్షల భారీ మొత్తంగా మారుతుంది.
55
సరైన ప్లానింగ్‌తో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం
ప్రస్తుత కాలంలో ఉద్యోగం చేసే వారి నుంచి సామాన్యుల వరకు అందరికీ మ్యూచువల్ ఫండ్స్ మొదటి ప్రాధాన్యంగా మారాయి. అయితే లంప్‌సమ్ విధానంలో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఆశించే రిటర్న్స్, మెచ్యూరిటీ కాలపరిమితి, మీకు కావలసిన ముగింపు కార్పస్ నిష్పత్తిని సరిగ్గా అంచనా వేసుకోవడం మంచిది. దీర్ఘకాలిక లక్ష్యాలతో క్రమశిక్షణతో పెట్టుబడి కొనసాగిస్తే అనుకున్న ఆర్థిక లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు.