మిక్కీ నేడు భారతదేశంలో ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్. తాజా వార్తల ప్రకారం, మేకప్ కోసం మిక్కీ ఒక్కొక్కరికి రూ.75,000 నుండి రూ. 1 లక్ష దాకా వసూలు చేస్తాడు. మిక్కీ పరిశ్రమలో అత్యంత ఖరీదైన మేకప్ ఆర్టిస్ట్. నెలకు కోట్లలో సంపాదిస్తాడు. మిక్కీ అంబానీ ఫ్యామిలీతో పాటు ఐశ్వర్యరాయ్ బచ్చన్, కరీనా కపూర్ ఖాన్, దీపికా పదుకొణె మరియు అనుష్క శర్మ వంటి ప్రముఖులకు కూడా మేకప్ చేస్తారు. 'డాన్', 'దిల్ తో పాగల్ హై', 'కార్తీక్ కాలింగ్ కార్తీక్' మరియు 'మై నేమ్ ఈజ్ ఖాన్' వంటి ప్రముఖ చిత్రాలకు మేకప్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశాడు.