సిబిల్ స్కోరు 500 కంటే తక్కువ ఉన్నా పర్లేదు..ఈ 3 మార్గాల్లో మీకు సులభంగా లోన్ రావడం ఖాయం..

First Published Apr 26, 2023, 3:18 PM IST

సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నప్పటికీ లోన్ కావాలా… అయితే అయితే మీ ముందు మూడు మార్గాలు ఉన్నాయి… అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తద్వారా మీరు సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న లోన్ పొందే అవకాశం లభిస్తుంది. 

మీరు బ్యాంకు నుంచి లేదా ఏదైనా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ నుంచి రుణాలు పొందాలనుకుంటే సిబిల్ స్కోర్ అనేది చాలా అవసరం.  సిబిల్ స్కోర్ అనేది మీకు క్రెడిట్ హిస్టరీని చూపిస్తుంది ముఖ్యంగా మీ పరపతి ఎంత ఉందో చెబుతుంది తద్వారా మీరు లోన్ పొందవచ్చు.  సాధారణంగా 700 పాయింట్ల పైన ఉంటే మంచి సిబిల్ స్కోర్ ఉందని అంటారు సిబిల్ స్కోర్ ను 500 నుంచి 900 పాయింట్ల మధ్యలో నిర్ణయిస్తారు 750 పాయింట్లు సిబిల్ స్కోర్ ఉంటే అనేక రకాల లోన్లు పొందే అవకాశం ఉంది. సాధారణంగా మీ వేతనం ఆధారంగా లోన్ పొందాలనుకుంటే సిబిల్ స్కోర్ తప్పనిసరి.  లేకపోతే మీకు రుణం పొందడం కష్టం అవుతుంది లేదా అధిక వడ్డీకి రుణాన్ని పొందాల్సి ఉంటుంది. 

సిబిల్ స్కోర్ అనేది మీరు సకాలంలో ఈఎంఐలను చెల్లిస్తే పెరుగుతుంది అదేవిధంగా చిన్న చిన్న లోన్ తీసుకున్నప్పుడు వెంటనే బ్యాంకుకు తిరిగి చెల్లించేయాలి లేకపోతే మీ సిబిల్ స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది.  అదేవిధంగా  క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకపోయినా మీ సిబిల్ స్కోర్ చాలా ఎఫెక్ట్ అవుతుంది.  ఈ నేపథ్యంలో సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నప్పటికీ మీకు రుణం కావాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి అవేంటో మనం ప్రస్తుతం తెలుసుకుందాం. 
 

Latest Videos


సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న సమయం లో సాధారణంగా బ్యాంకులో రుణాలు ఇచ్చేందుకు అంతగా ఆసక్తి చూపవు అయినప్పటికీ  కొన్ని ప్రైవేటు బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, ఫిన్ టెక్ సంస్థలు  రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.  అయితే వీటికి వడ్డీలు ఎక్కువ అన్న సంగతి గుర్తుంచుకోండి.  సాధారణంగా ఇలాంటి రుణాలపై ఎక్కువ వడ్డీని వసూలు చేస్తూ ఉంటారు. 

ఒకవేళ మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నట్లయితే మీరు రుణం పొందడం అత్యవసరం అనుకున్నట్లయితే మీతో పాటు మరో సహా  దరఖాస్తుదారుతో రుణం అప్లై చేసుకోవడం ఉత్తమమైన పని మీతో పాటు దరఖాస్తు చేసే వ్యక్తి మీ కుటుంబ సభ్యులు ఉండటం మంచిది. అంతే కాదు అతనికి క్రెడిట్ హిస్టరీ, వేతనము సరిగా ఉండాల్సిన అవసరం ఉంది అప్పుడు మీతో పాటు అప్లై చేసిన సహజరకాస్తుదారుడు కి కూడా రుణం చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది మీరు సరిగ్గా రుణం చెల్లించకపోతే అతనిపై భారం పడే అవకాశం ఉంది అన్న సంగతి గుర్తించాల్సి ఉంది.
 

ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మీరు రుణం పొందాలి అనుకుంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నప్పటికీ కొన్ని బ్యాంకులు ఆర్థిక సంస్థలు చిన్న మొత్తంలో రుణాలను అందిస్తూ ఉంటాయి. వీటికి పెద్దగా సిబిల్ స్కోర్ లెక్క చేయరు అయితే వడ్డీ అధికంగా ఉంటుందని గుర్తించాల్సి ఉంటుంది.  మీరు రుణాలు పొందే అవకాశం ఉంది వీటినే సెక్యూర్డ్ రుణాలను కూడా అంటారు.  ఇల్లు పొలం తనఖా పెట్టి రుణం పొందవచ్చు అదేవిధంగా బంగారం కుదువ పెట్టి కూడా రుణం పొందే వీలుంది వీటికి పెద్దగా సిబిల్ స్కోర్ తో పని ఉండదు.

click me!