ముఖేష్ అంబానీ వంటవాడికి ఇచ్చే జీతం ఎమ్మెల్యే వేతనం కన్నా ఎక్కువ..ఇంతకీ అతను రోజూ చేసే వంట ఏంటో తెలిస్తే షాకే..

Published : Apr 23, 2023, 08:34 PM IST

అంబానీ ఇంట్లో వంట వాడి జీతం ఏంటో తెలుసా... తెలిస్తే షాక్ అవడం ఖాయం.  ఓ రాష్ట్రంలో అత్యున్నత సభలో ప్రాతినిధ్యం వహించే, ఎమ్మెల్యేల కన్నా కూడా అంబానీ ఇంట్లో వంట వాడి జీతం ఎక్కువ అంటే ఆశ్చర్య పోవాల్సిందే. అయితే ఆ వంటవాడు.. ఏమేం వంటలు చేస్తాడో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.  

PREV
16
ముఖేష్ అంబానీ వంటవాడికి ఇచ్చే జీతం ఎమ్మెల్యే వేతనం కన్నా ఎక్కువ..ఇంతకీ అతను రోజూ చేసే వంట ఏంటో తెలిస్తే షాకే..
ambani

దేశంలోనే అత్యంత సంపన్నుడు ఆసియాలోనే నెంబర్ వన్ కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ ఏది చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయన వ్యాపారాలతో పాటు వ్యక్తిగత జీవితం సైతం ఎప్పుడు వార్తల్లో ప్రముఖంగా నిలుస్తూ ఉంటుంది.  ఈ నేపథ్యంలో తాజాగా ముకేష్ అంబానీ నివాసం ఉండే ఆంటీలియా  భవనం గురించి అనేక  వింతలు విశేషాలు మీడియాలో వ్యాప్తి చెందడం మనం చూసే ఉంటాము.  అయితే తాజాగా ఆయన భవనంలో పనిచేసే సిబ్బంది గురించి అనేక విషయాలు బయట ప్రపంచానికి తెలుస్తున్నాయి.  ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

26

 ముకేశ్ అంబానీ నివాసం ఉండే ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన భవనాల్లో ఒకటి ఈ భవనంలోనే ముకేశ్ అంబానీ కుటుంబం గత 11 ఏళ్లుగా నివాసం ఉంటుంది.  మొత్తం 27 అంతస్తుల ఈ భవనం దాదాపు 173 మీటర్ల పొడవులో ఉంది ముంబైలోని కుంభల హిల్స్ లో  ఉన్న ఈ భవంతి నిర్మాణం 2012లో పూర్తయింది అదే సంవత్సరం ముకేశ్ అంబానీ ఫ్యామిలీ మొత్తం ఈ భవనంలోకి షిఫ్ట్ అయింది.  మొత్తం నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ముండా ఈ భవంతిలో 168 కారులు పట్టే అతి పెద్ద గ్యారేజీ ఉండటం విశేషం.  అలాగే తొమ్మిది హై స్పీడ్ ఎలివేటర్స్ టెర్రస్ గార్డెన్స్ స్విమ్మింగ్ పూల్ స్పా హెల్త్ సెంటర్, థియేటర్, ఒక ఆడిటోరియం ఉండటం విశేషం. 

36
Image: Varinder Chawla

ఈ యాంటీలియా భవనంలో సుమారు 600 మంది స్టాఫ్ పనిచేస్తారు. వీరందరికి జీతభత్యాలను ముఖేష్ అంబానీ కుటుంబం చెల్లిస్తుంది.   ఇక ముఖేష్ అంబానీ కుటుంబానికి సకల సపరియలు చేసే ఈ సిబ్బందికి వేతనాలు ఏ విధంగా ఉంటాయో తెలిస్తే కళ్ళు తేలేయడం ఖాయం. 

46

ముఖ్యంగా ముఖేష్ అంబానీ కుటుంబానికి వంటలు చేసే చెఫ్ వేతనం సంవత్సరానికి 24 లక్షలు అంటే నెలకు రెండు లక్షలు  చెల్లిస్తున్నారు.  ఈ చెఫ్ కేవలం ముఖేష్ అంబానీ కుటుంబం భోజనం తయారీ కోసం అపాయింట్ చేశారు.  చెఫ్ కుటుంబానికి సంబంధించిన వసతి కూడా మొత్తం యాంటీయాలోనే ఉంటుంది.  అలాగే వారి కుటుంబానికి కావలసిన సకల సదుపాయాలను ముకేశ్ అంబానీ కుటుంబమే భరిస్తుంది. 

56

ఇక ముఖేష్ అంబానీ ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే, ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ సమయంలో సాంబార్ ఇడ్లీ తినడం ముకేశ్ అంబానీ కి అలవాటు.  ఆయన స్వతహాగా శాకాహారి కావడంతో చాలా సాత్వికమైన భోజనాన్ని తినేందుకే ఆయన ఇష్టపడతారు.  భోజనంలో సలాడ్స్,  రోటి దాల్ తినేందుకు ముకేశ్ అంబానీ ఆసక్తి చూపిస్తారు. అలాగే ముఖేష్ అంబానీ కోసం డైటీషియన్ సూచించిన వంటలను మాత్రమే ఆ చెఫ్ చేయాల్సి ఉంటుంది.  కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే మిఠాయిలను తింటారు. ముకేశ్ అంబాని చెఫ్  నియామకం ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా జరిగింది.  ఆయనకు సంబంధించిన అన్ని వివరాలు కూడా గోపియంగా ఉంటాయి. . ఆ ఏజెన్సీ వివరాలు సైతం తెలిపేందుకు ఇష్టపడరు. 

66

 ముఖ్యంగా అంబానీ కుటుంబం భద్రత దృష్ట్యా వారి సిబ్బందికి సంబంధించిన వివరాలను బయట ప్రపంచానికి పెద్దగా తెలియనివ్వరు.  అంతేకాదు వారి సిబ్బందికి సంబంధించిన బాగోగులు, కుటుంబాలు సైతం యాంటీ లీయాలోనే నివాసం ఉండటం విశేషం.  
 

Read more Photos on
click me!

Recommended Stories