Cibil Score: సిబిల్ స్కోర్ 500కు పడిపోయినా సరే, ఇలా చేస్తే బ్యాంకు నుంచి గంటలో కావాల్సినంత లోన్ వస్తుంది..

Published : Apr 23, 2023, 05:45 PM IST

మీ సిబిల్ స్కోర్ 600 కన్నా తక్కువగా పడిపోయిందా.  అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో మీకు లోన్ కావాలా.  అయితే సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా బ్యాంకు నుంచి రుణం పొందే వీలుంది.  అది ఎలాగో దానికి సంబంధించి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

PREV
16
Cibil Score: సిబిల్ స్కోర్ 500కు పడిపోయినా సరే, ఇలా చేస్తే బ్యాంకు నుంచి గంటలో కావాల్సినంత లోన్ వస్తుంది..

బ్యాంకు నుంచి రుణం పొందాలంటే సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ అనేది తప్పనిసరి అయ్యింది. ముఖ్యంగా సిబిల్ స్కోర్ అనేది మీరు రుణం తీర్చగలిగే సామర్థ్యాన్ని సూచిస్తుంది. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే మీకు రుణం లభించే అవకాశం అంత పెరుగుతుంది.  సకాలంలో రుణాలు చెల్లిస్తూ ఉంటే మీ సిబిల్ స్కోర్ ఆటోమేటిగ్గా పెరుగుతుంది.

26

 ఇప్పటికే అటు ప్రభుత్వ ప్రైవేటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలన్నీ కూడా సిబిల్ స్కోర్ ఆధారంగానే రుణాలను మంజూరు చేస్తున్నాయి.  సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే వడ్డీ కూడా పెంచుతున్నాయి. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నవారికి తక్కువ వడ్డీకే  రుణాలు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ఇంటి రుణాలు, కారు లేదా టూ వీలర్ రుణాలు, పర్సనల్ రుణాలు పొందే వారికి ఈ సిబిల్ స్కోర్ చాలా కీలకమైనది.

36

సిబిల్ స్కోర్ చెక్ చేసే సమయంలో మీ క్రెడిట్ హిస్టరీ బయటపడుతుంది. అంటే మీరు గతంలో తీసుకున్న అప్పులు అలాగే తిరిగి చెల్లించిన ఇఎంఐలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి. మీరు సకాలంలో క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న అప్పులను చెల్లించడం, అలాగే ఈఎంఐ లను కూడా సకాలంలో చెల్లిస్తే  మీ క్రెడిట్ స్కోర్ చక్కగా మెయింటైన్ అవుతుంది. లేకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గిపోయి, భవిష్యత్తులో మీరు రుణాలు మంజూరయ్యే అవకాశం ఉండదు.

46

సిబిల్ స్కోర్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ మీ క్రెడిట్ హిస్టరీని బట్టి ఒక రేటింగ్ ఇస్తుంది. దీన్నే సిబిల్ స్కోర్ అంటారు. సాధారణంగా మీరు బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లో లోన్ అప్లై చేసుకున్నప్పుడు మీ సిబిల్ స్కోర్ ను చెక్ చేస్తుంటారు. సిబిల్ స్కోర్ ను 300 నుంచి 900 పాయింట్ల వరకు గ్రేడింగ్ ఇస్తుంటారు. సాధారణంగా 750 పాయింట్లు పైన ఉంటే సిబిల్ స్కోర్ చక్కగా హెల్తీగా ఉందని అర్థం. 600 కన్నా తక్కువగా ఉంటే మీ సిబిల్ స్కోర్ ప్రమాదంలో పడిందని అర్థం. 

56

మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే మీకు రుణాలు లభించవు.  ముఖ్యంగా మీ వేతనం ఆధారంగా లభించే రుణాలకు  సిబిల్ స్కోర్ తప్పనిసరి. సిబిల్ స్కోర్ అనేది కేవలం లోన్ల కోసం మాత్రమే కాదు కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడానికి సైతం సిబిల్ స్కోర్ ను తనిఖీ చేస్తున్నాయి.  విదేశీ పర్యటనల్లో సైతం వీసా కోసం సివిల్ స్కోర్ ను అడుగుతున్నారు.  అందుకే సిబిల్ స్కోర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. . సకాలంలో ఈఎంఐ లను చెల్లిస్తూ ఉండాలి.  ముఖ్యంగా క్రెడిట్ కార్డు వాడేవారు డేట్ దాటకముందే మీ బిల్లులను చెల్లించాలి లేకపోతే మీ కరెంట్ స్కోరు ప్రభావితం అవుతుంది. 
 

66

ఇక సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా మీరు బ్యాంకుల నుంచి రుణాలను పొందవచ్చు.  అది ఎలాగంటే బంగారం,  ఇల్లు,  భూమి,  ఫిక్స్డ్ డిపాజిట్లు,  ఎల్ఐసి పాలసీలను తనఖా పెట్టడం ద్వారా ఈ రుణాలను మీరు పొందవచ్చు.  వీటిని సెక్యూర్డ్ రుణాలని అంటారు.  వీటికి సిబిల్ స్కోర్ తో సంబంధం లేదు. 
 

click me!

Recommended Stories