ముఖేష్ అంబానీ కొన్న ప్రైవేట్ జెట్ అన్ని వందల రూ.కోట్లా?

First Published | Sep 20, 2024, 2:06 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్ బోయింగ్ 737 MAX 9ని కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ విమానం  ప్రత్యేకతలు, ధర తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడు. ఆయన చాలా విలాసంగా జీవిస్తారు. అందుకే ఆయన అంత ఫేమస్. అంబానీ ఇంట్లో ఏం జరిగినా ప్రపంచ వార్తే అవుతుంది. ఇటీవలే తన చిన్న కుమారుడి పెళ్లి అంగరంగవైభవంగా చేసి ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేశారు. ముఖేష్ అంబానీకి ఒక ప్రత్యేకమైన హాబిట్ ఉంది. అదేంటంటే ప్రైవేట్ జెట్‌లు, హెలికాప్టర్‌ల కలెక్టింగ్. ఇవి బొమ్మలు కావు నిజమైనవే. ఆ క్రమంలోనే ముఖేష్ అంబానీ ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత ఖరీదైన జెట్‌లలో ఒకదానిని కొనుగోలు చేశారని సమాచారం. అంబానీ భారతదేశపు మొట్టమొదటి బోయింగ్ 737 MAX 9ని కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ అత్యాధునిక దీర్ఘ-శ్రేణి వ్యాపార జెట్ ఇప్పుడు అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్‌గా నిలిచింది. ఈ జెట్‌తో కలిపి అంబానీకి 10 విమానాలు ఉన్నాయి. 

స్విట్జర్లాండ్‌ నుంచి ఇండియాకు..

బోయింగ్ 737 MAX 9లో ఇటీవలే చాలా మార్పులు చేశారు. అనేక విమాన పరీక్షల తర్వాత ఇప్పుడు భారతదేశానికి తెచ్చారు. ముఖేష్ అంబానీ బోయింగ్ 737 MAX 9 స్విట్జర్లాండ్‌లోని యూరోఏర్‌పోర్ట్ బేసెల్-ముల్‌హౌస్-ఫ్రీబర్గ్ (BSL)లో రీమోడలింగ్ చేయించారు. క్యాబిన్ మార్పులు, ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లు సహా అనేక మార్పులు చేశారు. ఈ బోయింగ్ విమానం స్విట్జర్లాండ్‌లో ఉండేది. అన్ని అప్‌గ్రేడ్‌లు పూర్తయిన తర్వాత, టెస్టులు అన్నీ పూర్తి చేసిన తర్వాత ఇండియాకు తీసుకొచ్చారు. 

Tap to resize

త్వరలో ముంబైకి..

భారతదేశానికి రాకముందు ఈ ప్రైవేట్ జెట్ బేసెల్, జెనీవా, లండన్, లుటన్ విమానాశ్రయాల్లో టెస్టింగ్ చేశారు. ఆగస్టు 27, 2024న, బోయింగ్ 737 Max 9 బేసెల్ నుండి ఢిల్లీకి వచ్చింది. ఈ విమానం 9 గంటల్లో 6,234 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈ బోయింగ్ విమానం దేశంలోనే అత్యంత ప్రత్యేకమైన, ఖరీదైన ప్రైవేట్ జెట్‌లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం అంబానీ కొత్త విమానం ఢిల్లీ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ సమీపంలో ఉన్న నిర్వహణ టెర్మినల్‌లో ఉంది. రిలయన్స్ ప్రధాన కార్యాలయం ఉన్న ముంబైకి త్వరలో ఈ జెట్ రానుందని సమాచారం.

బోయింగ్ 737 MAX 9 ధర ఎంతో తెలుసా?

బోయింగ్ 737 MAX 9 ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెట్‌లలో ఒకటి. ఇది రెండు CFMI LEAP-18 ఇంజిన్‌లతో పనిచేస్తుంది. ఈ విమానం 8401 MSN నంబర్‌ను కలిగి ఉంది. ఒకే విమానంలో 6,355 నాటికల్ మైళ్లు(11,770 కి.మీ) ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. బోయింగ్ 737 MAX 9 ధర $118.5 మిలియన్లు. అయితే ఇందులో క్యాబిన్ రెట్రోఫిటింగ్, ఇంటీరియర్ మాడిఫికేషన్ ఖర్చులు ఉండవు. అదనంగా ఈ జెట్ బోయింగ్ MAX 8 కంటే పెద్ద క్యాబిన్, కార్గో స్థలాన్ని కలిగి ఉంది. అయితే ఈ అల్ట్రా-లాంగ్ రేంజ్ బిజినెస్ జెట్ కోసం అంబానీ కుటుంబం రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేసిందని సమాచారం.

మొత్తం 10 విమానాలు

ఈ కొత్త జెట్‌తో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ వద్ద ఇప్పటికే తొమ్మిది ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వద్ద బాంబార్డియర్ గ్లోబల్ 6000, రెండు డస్సాల్ట్ ఫాల్కన్ 900లు, ఎంబ్రేయర్ ERJ-135 విమానాలు ఉన్నాయి

Latest Videos

click me!