Amazonలో ఆఫర్లే ఆఫర్లు: కళ్లు చెదిరే డిస్కౌంట్లతో Great Indian Festival 2024

First Published | Sep 19, 2024, 2:05 PM IST

ఇండియాలో Amazon Great Indian Festival 2024 సందడి మొదలు కానుంది. ప్రతి సంవత్సరం ప్రకటించినట్లుగానే ఈ సారి కూడా అమెజాన్ తన కస్టమర్లను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్లతో ఆఫర్లు ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి ఇవన్నీ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. Amazon Prime Membersకి ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 26 నుంచి ఆఫర్లు పొందవచ్చు. ఈ సేల్ అమెజాన్‌లో ఏటా జరిగే అతిపెద్ద ఈవెంట్లలో ఒకటి. ఇందులో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ అప్లయెన్సెస్ మరిన్ని రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేంద్దాం రండి.
 

స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం
iPhone 13, సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, వన్‌ప్లస్ 12 సిరీస్, మోటరోలా రేజర్ వంటి ప్రముఖ ఫోన్లపై 40% వరకు తగ్గింపు లభిస్తుంది.

iPhone రూ.39,999 లకే..
iPhone 13 వంటి హ్యాండ్‌సెట్‌లపై భారీ తగ్గింపులు పొందవచ్చు. ఇందులో Apple A15 Bionic SoC, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. సెప్టెంబర్ 16న తాజా iOS 18 విడుదల కానుంది. అది కూడా ఇందులో అప్‌డేట్‌ అవుతుంది. iPhone 13 ధర అమెజాన్ లో రూ.45,999 ఉండగా ఈ సీజన్లో అన్ని డిస్కౌంట్లతో కలిపి రూ.39,999 లకే వినియోగదారులు పొందవచ్చు. 

Samsung నుండి Samsung Galaxy S24 Ultra 5G, Galaxy Z Fold 6, Galaxy Z Flip 6 వంటి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి. Xiaomi 14 Civi, మొత్తం OnePlus 12 సిరీస్‌లు కూడా 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 

Motorola రీసెంట్ ఫోల్డబుల్ Razr 50 సిరీస్ కూడా ఈ సీజన్ లో తగ్గింపు ధరకు లభిస్తుంది. Tecno, Itel, Oppo, Vivo వంటి బ్రాండ్‌ కంపెనీలు కూడా బడ్జెట్ ఆఫర్‌లు ప్రకటిస్తున్నాయి. 
 


టీవీలపై 65 శాతం..
43, 55, 65 inches స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. OLED మరియు QLED మోడల్స్ కూడా తగ్గింపులతో లభిస్తాయి. ఈ టీవీలన్నిటిపై మాక్సిమం 65 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కొత్త టీవీలు కొనుక్కోవాలనుకున్న వారికి ఈ సీజన్ అద్భుతమైన భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. 
 

బ్యాంక్ ఆఫర్లు: గత సంవత్సరం ప్రకటించినట్టుగానే ఈ సారి కూడా ఎస్‌బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించేవారికి అదనంగా 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది. మీరు కొనే వస్తువు ధరలో ఫ్లాట్ 10 శాతం తగ్గుతుంది. ఈ ఆఫర్ వినియోగదారులకు ఎంతో డబ్బును ఆదా చేస్తుంది. 
 

అమెజాన్ పే ఉపయోగిస్తే మరింత డిస్కౌంట్..
మీరు అమెజాన్ పే యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే ఫ్లాట్ రూ.1000 క్యాష్ బ్యాక్ పొందుతారు. అది కూడా మినిమం రూ.1000 విలువ చేసే వస్తువు కొంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ విలువైన వస్తువులు కొన్నా మరిన్ని క్యాష్ బ్యాక్ లు పొందడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. 

అంతేకాకుండా అమెజాన్ పే ఉపయోగించినందుకు ప్రత్యేక రివార్డ్స్, కూపన్లు కూడా మీరు పొందవచ్చు. వీటిని ఉపయోగించుకొని ఇంటికి సంబంధించినవి, కిచెన్ లో ఉపయోగించేవి, ఫ్యాషన్, బ్యూటీకి సంబంధించిన వస్తువులు మీరు కొనుక్కోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. 

మీరు అమెజాన్ గిఫ్ట్ కార్డులు కొనుచేసి వాటి ద్వారా ఐటమ్స్ కొంటే మీరు 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 

ఉద్యోగులు, విద్యార్థలకు ఈ ఫెస్టివల్ సీజన్ మరిన్ని ఆఫర్లు తెచ్చింది. వారికి అవసరమైన ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. 60 శాతం వరకు ట్రావెల్ బుకింగ్స్, బ్యాగ్స్,  ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులపై తగ్గింపు అందుతుంది. మరిన్ని రకాల వస్తువులపై కూడా భారీ తగ్గింపులు ఉన్నాయి. అమెజాన్ పే వినియోగదారులకు ఈఎంఐ, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు మీరు ఎంచుకున్న ఐటమ్ ను బట్టి మరిన్ని డిస్కౌంట్లు, ఆఫర్లు మీకు లభిస్తాయి. 
మీరు అమెజాన్  సైట్‌ను తరచుగా పరిశీలించడం ద్వారా మరిన్ని ఆఫర్ల గురించి తెలుసుకోవచ్చు. 

Latest Videos

click me!