మీ బిజినెస్ పెరిగే కొద్దీ, ఆర్డర్లు కూడా పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మీరు పెద్ద మొత్తంలో షాపు ఏర్పాటు చేసుకొని బిజినెస్ చేయవచ్చు. సాధారణంగా చిన్న పట్టణాల్లోనూ అలాగే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ బిజినెస్ లో కొంత రిస్కు కూడా ఉంది. సులభ వాయిదాలను చెల్లించే విషయంలో కొద్ది మంది మొండికేసే అవకాశం ఉంది కావున వీటన్నిటిని బేరీజు వేసుకొని మీరు ఈ బిజినెస్ లోకి దిగితే మంచిది.