సాధారణంగా ఒక బేకరీ ఏర్పాటు చేయడానికి కనీస పెట్టుబడి రెండు లక్షల నుంచి 5 లక్షల వరకు అవుతుంది. బేకరీలో బ్రెడ్డు బన్ను తో పాటు బిస్కెట్లు, ఎగ్ పఫ్ కర్రీ పఫ్ వంటి ఇతర ఉత్పత్తులను కూడా అందుబాటులో ఉంచుకుంటే మంచి బేరం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బేకరీలో బర్త్డే కేకులకు మంచి డిమాండ్ ఉంటుంది. మీరు కూడా బర్త్డే కేక్ డిజైనింగ్ నేర్చుకున్నట్లయితే చక్కటి బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది.