ఇతరులకు అప్పు ఇచ్చి తిరిగి వసూలు చేసే క్రమంలో ఎదురయ్యే నెగిటివిటీ గురించి ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. డబ్బు విషయంలో రిలేషన్స్ ఎలా దెబ్బతింటాయో, మనమే చెడ్డవాళ్లం ఎలా అవుతామో మీకు అర్ధమయ్యేలా చెబుతుంది. అప్పు ఇచ్చే ముందు ఆ డబ్బు తిరిగి రాదు అని ఫిక్స్ అయ్యి ఇస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఆర్థికంగా, మానసికంగా దెబ్బతినక తప్పదు.