Pension Plan: నెలకు రూ.55 కడితే చాలు.. రిటైర్మెంట్ తర్వాత రూ.3000 పెన్షన్. మీరు అర్హులేనా?

Published : Mar 15, 2025, 02:22 PM IST

Pension Plan: కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3000 పెన్షన్ పొందొచ్చు. ఈ పెన్షన్ పథకం పొందడానికి మీకు అర్హత ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవండి. 

PREV
14
Pension Plan: నెలకు రూ.55 కడితే చాలు.. రిటైర్మెంట్ తర్వాత రూ.3000 పెన్షన్. మీరు అర్హులేనా?

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను తీసుకొస్తోంది. అందులో భాగంగానే రిటైర్మెంట్ తర్వాత రూ.3000 పొందేలా ఒక అద్భుతమైన పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. దీని వల్ల వయసు పైబడిన వారికి ఆ సమయంలో ఈ అమౌంట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం భావిస్తోంది. ఈ పెన్షన్ స్కీమ్ లో చేరాలంటే ఎలాంటి అర్హతలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

 

24

సామాన్యుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన అడుగు వేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అమలు చేస్తున్నపెన్షన్ పథకానికి పోటీగా దేశ వ్యాప్తంగా ఈ పెన్షన్ స్కీమ్ ను అమలు చేయనున్నారు.  మోదీ ప్రభుత్వం ఇప్పుడు దేశ ప్రజలకు వారి రిటైర్మెంట్ తర్వాత రూ.3 వేలు పొందేలా పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. మీరు చేరితే మీరు నెలకు రూ.55 చెల్లిస్తే సరిపోతుంది. మీ పదవీ విరమణ తర్వాత నెలకు రూ.3,000 వస్తాయి. 

34

ఈ పథకం పేరు శ్రమ్ యోజన పథకం. మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని దేశ ప్రజల కోసం తీసుకువచ్చింది. ఈ పథకం అసంఘటిత రంగంలో పనిచేసే ప్రజల కోసం అమలు చేసిన పథకం. అంటే ఈ స్కీమ్ పారిశుద్ధ్య కార్మికులు, లాండ్రీ కార్మికులు, రిక్షా పుల్లర్లు, ఇటుక బట్టీ కార్మికులు ఇలాంటి అసంఘటిత రంగంలో పనిచేసే వారికి వర్తిస్తుంది.

44

ఈ శ్రమ్ యోజన పథకంలో మీరు చేరితే మీకు రిటైర్మెంట్ వయసు తర్వాత నెలకు రూ.3,000 లభిస్తాయి. అయితే మీరు నెలకు రూ.55 చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఉద్యోగులకు పీఎఫ్ కట్ అవుతుంది కదా.. కాని అసంఘటిత కార్మికులు కాబట్టి ఎవరి వారే ప్రతి నెలా రూ.55 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రిటైర్మెంట్ వయసు తర్వాత నెలకు రూ.3,000 పొందుతారు.

click me!

Recommended Stories